Kaju Paneer : మనకు ధాబాలల్లో లభించే పనీర్ వెరైటీలల్లో కాజు పనీర్ కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. రోటీ, చపాతీ, నాన్, బటర్ నాన్ వంటి వాటితో తినడానికి ఈ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. చాలా మంది ఈ కర్రీని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ కర్రీని ఇంట్లో మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా ఇంట్లోనే కాజు పనీర్ కర్రీని ధాబా స్టైల్ లో తయారు చేసుకోవచ్చు. ఎవరైనా చాలా తేలికగా దీనిని తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే కాజు పనీర్ కర్రీని ధాబా స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ధాబా స్టైల్ కాజు పనీర్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – పెద్దవి రెండు, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 2, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, ప్రెష్ క్రీమ్ – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – అర కప్పు, పనీర్ – 250 గ్రా., వేయించిన జీడిపప్పు – పావు కప్పు, బటర్ – 2 టేబుల్ స్పూన్స్, కసూరిమెంతి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ధాబా స్టైల్ కాజు పనీర్ కర్రీ తయారీ విధానం..
ముందుగా జార్ లో టమాటాలు, జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత ప్రెష్ క్రీమ్ వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత పనీర్, వేయించిన జీడిపప్పు, బటర్ వేసి కలపాలి. తరువాత మూత పెట్టి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత కసూరిమెంతి, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాజు పనీర్ కర్రీ తయారవుతుంది. ఇలా ఇంట్లోనే చాలా సులభంగా ధాబా స్టైల్ పనీర్ కర్రీని తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.