Food Combinations : మనం రుచి కొరకు వివిధ రకాల ఆహారాల పదార్థాలను కలిపి ఒకేసారి తీసుకుంటూ ఉంటాము. ఇలా రెండు లేదా మూడు ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల వాటి రుచి మరింతగా పెరుగుతుంది. అయితే ఇలా తీసుకునే వాటిలో కొన్ని విరుద్ద ఆహారాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అలాగే కొన్ని ఆరోగ్యానికి మేలు చేసేవి కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అలాగే ఇలాంటి ఆహార పదార్థాల మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మనకు ఆనందం కూడా కలుగుతుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే వివిధ రకాల ఆహార పదార్థాల మిశ్రమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సలాడ్ లో ఉడికించిన గుడ్డును ముక్కలుగా చేసి తీసుకోవడం వల్ల చాలా రుచిగాఉంటుంది. అలాగే దీనిని తీసుకోవడం వల్ల మన శరీరానికి మేలు కలుగుతుంది.
గుడ్డులో ఉండే కొవ్వులు, కూరగాయల్లో ఉండే కెరోటినాయిడ్లను గ్రహించడంలో సహాయపడతాయి. అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడకుండా కాపాడతాయి. అలాగే పసుపును, నల్ల మిరియాలను కలిపి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మిరియాల్లో ఉండే పైపెరిన్ పసుపులో ఉండే కర్యుమిన్ ను శరీరం గ్రహించడంలో దోహదపడుతుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ కూడా తగ్గుతుంది. అదేవిధంగా బచ్చలికూరను, నిమ్మకాయ రసాన్ని కలిపి సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. బచ్చలికూరలో ఉండే ఐరన్ ను గ్రహించడంలో నిమ్మరసం మనకు సహాయపడుతుంది. అలాగే ఆకుకూరలను నిమ్మరసంతో కలిపి తీసుకోవడం వల్ల ఆకుకూరల్లో ఉండే పోషకాలను పూర్తిగా గ్రహించడంలో నిమ్మరసం మనకు తోడ్పడుతుంది.
అదే విధంగా క్వినోవాతో పాటు ఉడికించిన కూరగాయలను కలిపి తీసుకోవడం వల్ల సంపూర్ణ భోజనం తయారవుతుంది. క్వినోవా వగరు రుచిని కలిగి ఉంటుంది. కనుక దీనిని కూరగాయలతో కలిపి తీసుకోవడం వల్ల రుచి పెరగడంతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలు కూడా అందుతాయి. ఇక అరటిపండ్లను తీసుకోవడం వల్ల మానసిక స్థితి పెరుగుతుందని మనందరికి తెలుసు. ఈ అరటిపండ్లను ఆల్మండ్ బటర్ తో కలిపి తీసుకోవడం వల్ల మానసిక స్థితి మరింతగా పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. అలాగే టమాటాలను, అవకాడోను కలిపి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. టమాటాలో లైకోపీన్ ఉంటుంది. చర్మాన్ని కాపాడడంలో, వివిధ రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా శరీరాన్ని కాపాడడంలో ఇది మనకు సహాయపడుతుంది.
టమాటాలను అవకాడోలతో కలిపి తీసుకోవడం వల్ల టమాటాలల్లో ఉండే లైకోపీన్ ను శరీరం ఎక్కువగా శోషించడంలో అవకాడోలు మనకు సహాయపడతాయి. కనుక వీటిని కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మరింతగా మేలు కలుగుతుంది. అలాగే ఓట్స్ ను, బెర్రీ వంటి పండ్లతో కలిపి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా పొందవచ్చు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఇక డార్క్ చాక్లెట్ ను, గ్రీన్ టీని కలిపి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. శరీరం అలసట తగ్గుతుంది. ఈ విధంగా ఈ ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.