పుట్టిన ప్రతి ఒక్కరికి చావు తప్పదు. ఎవరైనా సరే ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందే. పుట్టిన తర్వాత ఎలా అయితే కొన్ని వాటికి కొన్ని ప్రక్రియలు ఉంటాయో, చనిపోయిన తర్వాత దహనం చేయడానికి కూడా ప్రక్రియ ఉంటుంది. వాటి ప్రకారం దహనం చేయడం జరుగుతుంది. ఒకసారి దహనం చేసిన తర్వాత ప్రతి ఒక్క శరీర భాగం కూడా బూడిదవుతుంది. అది కూడా కొన్ని గంటల్లోనే. అయితే మీకు తెలియని ఒక విషయం ఉంది.
అదేంటంటే, మనం శరీర భాగాల్లో అన్ని భాగాలు కూడా బూడిద అవుతాయి. కానీ ఒకటి మాత్రం అస్సలు బూడిద అవ్వదు. అవే పళ్ళు. ఎముకలు కూడా బూడిద అయిపోతాయి. కానీ పళ్ళు మాత్రం బూడిద అవ్వవు. దీని వెనుక సైన్స్ దాగి ఉంది. పళ్ళు క్యాల్షియం, ఫాస్పేట్ తో తయారు అవుతాయి. ఇవి చాలా దృఢంగా ఉంటాయి.
ఇవి కాలిపోవు. పళ్ళు తప్ప ఏ శరీర భాగం కూడా అలా ఉండిపోదు. కేవలం పళ్ళు మాత్రమే మిగిలిపోతాయి. ఎక్కువ టెంపరేచర్ లో కూడా అవి కాలవు. వాటి స్ట్రక్చర్ వలన అలా కాలిపోకుండా ఉంటాయట. ఇది చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ, నిజమైతే ఇదే. సైంటిఫిక్ గా చూసినట్లయితే పళ్ళు కాలి పోకుండా ఉంటాయట. పళ్ళు తప్ప మిగిలిన శరీర భాగాలన్నీ కూడా బూడిదైపోతాయి. అది కూడా చాలా కొన్ని గంటల్లోనే.