Dj Tillu : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూర్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో వచ్చిన మూవీ.. డీజే టిల్లు. ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. ఎస్.థమన్ సంగీతం అందించారు. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దీంతో సిద్ధు కెరీర్ ముఖ్యమైన టర్న్ తీసుకుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే డీజే టిల్లుకు సెకండ్ పార్ట్‌ను చిత్రీకరించాలని చూస్తున్నారు.
ఇక డీజే టిల్లు సినిమాకు మొత్తం రూ.8 కోట్లు ఖర్చు చేయగా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ క్రమంలోనే ఈ మూవీ మొత్తంగా రూ.30.30 కోట్ల గ్రాస్‌ను సాధించింది. రూ.17.25 కోట్ల షేర్ వచ్చింది. తెలంగాణ, ఏపీలలో ఈ మూవీ రూ.24.52 కోట్ల గ్రాస్‌ను, రూ.14.14 కోట్ల షేర్‌ను సాధించింది. ఈ సినిమాకు ఇంత రెస్పాన్స్ లభిస్తుందని అసలు ఎవరూ ఊహించలేనే లేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ఈ మూవీలో సిద్ధు తనదైన శైలిలో చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన తన నటనతోనే ఈ సినిమాను హిట్ చేశారని చెప్పవచ్చు. అలాగే నేహాశెట్టి కూడా గ్లామరస్‌గా కనిపించి అదరగొట్టేసింది. అయితే డీజే టిల్లు 3 మూవీకి గాను ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ మూవీ గురించి త్వరలోనే ఒక అప్‌డేట్‌ను ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.