Evil Spirit In Home : ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఎవరూ కూడా దురదృష్టం కలగాలని చెడు జరగాలని అనుకోరు. మంచి, చెడు మన చేతుల్లో లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. రెండు కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. అయితే దుష్టశక్తులు ఉన్నాయని ఎలా చెప్పొచ్చు అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.. ప్రతి నిర్మాణానికి పాజిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ ఉన్నచోట ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లోకి అడుగుపెట్టగానే ఏదో హాయిగా ఉంటుంది.
అన్ని ఇళ్లల్లో కూడా ప్రశాంతంగా అనిపించదు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే అస్సలు ప్రశాంతత ఉండే ఉండదు. ప్రశాంతత లేనట్లయితే అక్కడ దుశశక్తి ఉందని మనం చెప్పొచ్చు. ఇంట్లో మొక్కలు, పువ్వులు చనిపోతూ ఉంటాయి అలాంటప్పుడు నెగటివ్ ఎనర్జీ అక్కడ ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా ఎక్కువగా సాలిపురుగులు అక్కడ చేరుతూ ఉంటాయి. గూళ్ళు కడుతూ ఉంటాయి. అలా ఉంటే కూడా నెగటివ్ ఎనర్జీ ఉంటారని చెప్పొచ్చు.
అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ వచ్చేస్తుంది. అలాంటప్పుడు కూడా అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం చెప్పొచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు తలపోటు విపరీతంగా వచ్చేస్తుంది. అలా కూడా మనం దుష్టశక్తి అక్కడ ఉందని చెప్పొచ్చు. ఏదో ఒకటి చెయ్యి జారిపోవడం తరచు పాలు పొంగిపోవడం ఏదో ఒకటి మాడిపోవడం వంటివి జరిగితే కూడా ఆ ఇంట్లో దుష్ట శక్తి ఉందని చెప్పొచ్చు.
ఏదో తెలియని బాధ కుటుంబాన్ని వెంటాడుతున్నట్లయితే కూడా అక్కడ దుష్టశక్తి ఉందని చెప్పొచ్చు. పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో మురికి బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. ఎల్లప్పుడూ బట్టల్ని ఉతికి ఉంచుకోవాలి. దేవుళ్ళ విగ్రహాలని ఎదురెదురుగా పెట్టకూడదు. పక్కపక్కన వేరువేరుగా పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన నెగటివ్ ఎనర్జీ రాకుండా మనం చూసుకోవచ్చు. ఇంట్లో పనికిరాని పుస్తకాలు, వస్తువులు, బట్టలు వంటివి తీసేస్తూ ఉండాలి. ఇలా ఈ తప్పులను చేయకుండా చూసుకుంటే దుష్టశక్తులు ఇంట్లోకి రావు.