మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. వాటిల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. కానీ వాటిని గుర్తించి మనం సరిగ్గా వాడుకోవడం లేదు. అలాంటి మొక్కల్లో ఇన్సులిన్ మొక్క కూడా ఒకటి. దీన్ని నర్సరీల్లోనూ విక్రయిస్తారు. మన చుట్టూ పరిసరాల్లోనూ ఈ మొక్క పెరుగుతుంది. దీన్నే కాస్టస్ పిక్టస్ అని పిలుస్తారు. ఈ మొక్క వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారికి మాత్రం ఈ మొక్క వరమనే చెప్పవచ్చు. ఈ మొక్క ఆకును రోజుకు ఒకటి నమిలితే చాలు, షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
కాస్టస్ పిక్టస్ మొక్క ఆకులు పొడవుగా ఉంటాయి. రుచికి పుల్లగా ఉంటాయి. ఒక్క ఆకును నమిలినా చాలు శరీరంలోని గ్లూకోజ్ గ్లైకోజెన్‌గా మారుతుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఈ మొక్క ఆకును రోజుకు ఒకటి తినాల్సి ఉంటుంది. ఇక ఈ మొక్క ఆకుల ద్వారా మనకు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఈ ఆకులను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో దగ్గు, జలుబు సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ మొక్క ఆకులను మనం పేస్ట్, పొడి లేదా కషాయం రూపంలోనూ తీసుకోవచ్చు. ఈ ఆకులను నమలడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు సైతం మెరుగు పడుతుంది. అయితే ఈ మొక్క ఆకులు అందరికీ పడకపోవచ్చు. ఈ ఆకులను తిన్న వెంటనే కొందరిలో విరేచనాలు, గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కనుక అలాంటి వారు తినకూడదు. ఈ ఆకులను తినేముందు డాక్టర్ సలహా తీసుకుంటే మంచిది. లేదంటే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ప్రమాదకరంగా మారుతుంది. కనుక డాక్టర్ సలహా మేరకు ఈ మొక్క ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది.