సాధారణంగా చాలామంది వారి ఆహారంలో భాగంగా పెరుగును దూరం పెడుతుంటారు. పెరుగు తీసుకోవడం వల్ల జలుబు చేస్తుందని, శరీర బరువు పెరిగి పోతారనే అపోహల కారణంగా చాలామంది పెరుగును తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా మీరు పెరుగును పక్కన పెడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతున్నట్లుని చెప్పవచ్చు.పెరుగు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇకపై ప్రతి రోజూ మీ ఆహారంలో తప్పనిసరిగా పెరుగును చేర్చుకుంటారు. మరి పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
*పెరుగులో ముఖ్యంగా క్యాల్షియం, ప్రొటీన్లు, లాక్టోస్ పుష్కలంగా లభిస్తాయి. క్యాల్షియం అధిక భాగంలో ఉండటం వల్ల ఎముకలు దంతాలు దృఢంగా తయారవడానికి దోహదపడతాయి.
*పెరుగులోకి కొద్దిగా ఎండు ద్రాక్షలను కలిపి తీసుకుంటే మన శరీరానికి శరీరానికి ఇ, ఎ, సి, బీ 2, బీ12 విటమిన్లతోపాటు కెరోటోనాయిడ్స్ పుష్కలంగా లభిస్తాయి.
*కొందరు తరచూ వాతం, కఫం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటివారు పెరుగును తీసుకోవడం వల్ల ఈ సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు.
*దగ్గు, జలుబు సమస్యతో బాధపడేవారు పెరుగును దూరం పెట్టకుండా పెరుగులో కాస్త మిరియాల పొడి, బెల్లం పొడి కలిపి తింటే జలుబు దగ్గు వంటి సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.
*నీరసం, మూత్రాశయ సమస్యలతో బాధపడేవారు పెరుగులో కాస్త చక్కెర కలిపి తీసుకోవడం వల్ల తక్షణమే శరీరానికి శక్తి అందుతుంది. అదేవిధంగా మూత్రాశయ సమస్యలు కూడా తొలగిపోతాయి.పెరుగు తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక రోజు వారి ఆహారంలో పెరుగు తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు.