మన ఇంట్లోకి సంపద కలగాలని మనం నిత్యం లక్ష్మీదేవికి పూజలు చేస్తుంటాం. లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల సంపదలను ప్రసాదిస్తుందని భావిస్తాం. ఈ క్రమంలోనే లక్ష్మీదేవికి పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు. అదేవిధంగా మన ఇంట్లో సంపద కలగాలంటే మన ఇంటి నిర్మాణం చేపట్టేప్పుడు కూడా చాలామంది వాస్తు నియమాలను పాటిస్తూ వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపడతారు. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది అపార్ట్మెంట్లను కొనుగోలు చేసి వాటిలో ఉండటం వల్ల కొన్ని వాస్తు లోపాలు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలోనే వాస్తుకు అనుగుణంగా ఆ ఇంటిని మార్చుకుంటారు.
అయితే కొందరు వాస్తు ప్రకారం ఇంటి నిర్మించినప్పటికీ ఎన్నో కష్టాలు పడుతూ డబ్బులను సంపాదిస్తున్నప్పటికీ కూడా ఆ ఇంటిలో డబ్బు నిల్వ ఉండదు. వచ్చినవి వచ్చినట్టు వృథాగా ఖర్చు అవుతూ ఉంటాయి. ఈ విధంగా డబ్బు ఇంట్లో నిలవని వారు మన ఇంట్లో కొన్ని నియమాలను పాటించడం వల్ల సంపద కలుగుతుంది. మరి ఏ విధమైన నియమాలను పాటించాలి అనే విషయానికి వస్తే..
మన ఇంట్లో ప్రధాన ద్వారం ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే గుమ్మం దగ్గర డోర్ మ్యాట్ ను గుమ్మం లోపల ఉంచాలి. అది కూడా నలుపు రంగు అయితే ఇంటిపై ఎలాంటి దృష్టి పడకుండా కాపాడుతుంది. ఇక ఈ డోర్ మ్యాట్ కింద పటిక బెల్లం పౌడర్, లేదా పలుచని వస్త్రంలో కొద్దిగా పటిక బెల్లం కట్టి డోర్ మ్యాట్ మధ్యభాగంలో ఉంచడం వల్ల మన ఇంటిలో ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. ఈ క్రమంలోనే మన ఇంట్లో ఆర్థిక ఎదుగుదల ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.