Sweet Potatoes : స్వీట్ పొటాటో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. స్వీట్ పొటాటోని తీసుకోవడం వలన అనేక లాభాలని పొందొచ్చు. చాలామంది స్వీట్ పొటాటో ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే నిజానికి స్వీట్ పొటాటోని తీసుకోవడం వలన అనేక లాభాలని పొందవచ్చు. మరి ఎలాంటి లాభాలని పొందొచ్చు..? ఏయే సమస్యలకి దూరంగా ఉండొచ్చు అనే విషయాలను తెలుసుకుందాం. ఈ దుంపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. స్వీట్ పొటాటోని తీసుకుంటే చాలా చక్కటి ఫలితం ఉంటుంది. స్వీట్ పొటాటోలో కెరోటిన్, విటమిన్ బి6 ఎక్కువ ఉంటాయి.
రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తుంది. మధుమేహం సంబంధిత గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది. స్వీట్ పొటాటోలను తీసుకోవడం వలన దంతాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. చర్మం, నరాలు, థైరాయిడ్ గ్రంథి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకలని కూడా బలంగా మార్చడం కోసం కూడా స్వీట్ పొటాటోని తీసుకోండి. ఫైబర్ కంటెంట్ ఇందులో ఎక్కువ ఉండడంతో మలబద్దకం సమస్య ఉండదు.
స్వీట్ పొటాటోలని తీసుకోవడం వలన అల్సర్ బాధ కూడా ఉండదు. ఈ దుంపల్లో విటమిన్ డి, బీటా కెరోటిన్, పొటాషియం, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు చిలగడదుంపని తీసుకోవడం వలన పిండం యొక్క అభివృద్ధికి ఎంతో సహాయపడుతుంది. గుండెలో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
క్రమం తప్పకుండా స్వీట్ పొటాటో ని తీసుకోవడం వలన పోషకాలు బాగా అందుతాయి. జీర్ణ సమస్యలు, గుండె జబ్బులు వంటివి ఉండవు. స్వీట్ పొటాటో ని తీసుకుంటే ఐరన్ కూడా బాగా అందుతుంది. తెల్ల రక్త కణాల నిర్మాణానికి ఈ దుంప సహాయ పడుతుంది. స్వీట్ పొటాటోని తీసుకుంటే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు.