Khadgam Movie : కృష్ణవంశీ సినిమా అంటే అందులో తప్పకుండా చిత్ర కథలో కుటుంబ నేపథ్యం కచ్చితంగా ఉంటుంది. దాదాపు ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాలలో ఖడ్గం కూడా ఒకటి. 2002లో వచ్చిన ఈ సినిమా భారత్‌లో హిందూ, ముస్లింల మధ్య స్నేహబంధం ఎలా ఉంటుందో అని తెలియజేసే నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద ఘన విజయాన్ని అందుకొని భారీ వసూళ్లను రాబట్టింది. ఖడ్గం చిత్రంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి గాను నంది అవార్డులతోపాటు ఎన్నో ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సోనాలి బింద్రే, కిమ్ శర్మ, సంగీత వీరు ముగ్గురు హీరోయిన్స్ గా నటించారు.
అయితే ఖడ్గం సినిమాలో సంగీత పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే సినిమా అవకాశాల కోసం పల్లెటూరి నుంచి సిటీకి వచ్చిన అమ్మాయి పాత్రలో కనిపించింది. ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ.. రవితేజ అలాగే సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తూనే రవితేజను ఇష్టపడుతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కోసం దర్శకుడు బెడ్‌రూమ్‌లోకి వెళ్లాల్సిన సన్నివేశం ఉంటుంది. అయితే సంగీత అమ్మ అయిన పావలా శ్యామల తన కూతురును హీరోయిన్ చేయాలన్న కోరికతో ఆమె బలవంతంతో అయిష్టంగానే సంగీతను ఆ దర్శకుడితో రూమ్‌లోకి పంపిస్తుంది. ఆ దర్శకుని ఒడిలో కూర్చొని అతడికి మందు తాగిస్తుంటుంది. అప్పుడు రవితేజ తలుపు తోసుకోని తాను ఇష్టపడిన అమ్మాయిని అలాంటి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోతాడు.
సినిమా రంగంలో సాధారణంగా హీరోయిన్లకు ఇలాంటి పరిస్థితే ఉంటుందని కృష్ణవంశీ కూడా అందుకే ఆ సీన్ పెట్టారని అప్పట్లో టాక్ వినిపించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఇలాంటి సంఘటనలపై ఓ సీనియర్ దర్శకుడిని టార్గెట్ చేసే కృష్ణవంశీ కావాలనే ఈ సీన్ పెట్టారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. మరొక వైపు హీరోయిన్ రమ్యకృష్ణను ఓ సినిమా షూటింగ్ లో ఓ దర్శకుడు ఇబ్బంది పెట్టిన తరుణంలో కృష్ణవంశీ కావాలనే వంశీ ఆయనను టార్గెట్ చేస్తూ ఖడ్గంలో ఈ సీన్ క్రియేట్ చేశారని కూడా ప్రచారం జరిగింది.
ముఖ్యంగా రమ్యకృష్ణ సైతం ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్‌గా ఎదగాలంటే తప్పకుండా దర్శక, నిర్మాతలు చెప్పినట్లు చేయవలసిందే అని.. వారు రమ్మన్న గదుల్లోకి వెళ్లాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అసలు ఖడ్గంలో ఈ సన్నివేశాన్ని పెట్టడానికి వెనుక ఆంతర్యం ఏమిటో దర్శకుడు కృష్ణవంశీకే తెలియాలి.