Human Birth : చాలామంది, పిల్లలు పుట్టిన తర్వాత మంచి, చెడు చూసుకుంటూ ఉంటారు. పుట్టిన నక్షత్రం మంచిదా కాదా..? ఇటువంటివన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. అయితే, రాత్రి పిల్లలు పుడితే మంచిదా..? పగలు పిల్లలు పుడితే మంచిదా..? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి పిల్లలు రాత్రి పుడితే మంచిదా..? పగలు పుడితే మంచిదా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. అర్ధరాత్రి నుండి రెండు గంటల మధ్యలో పిల్లలు కనుక పుట్టినట్లయితే, ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతని వాళ్ళు ఇస్తారు.
ఈ టైంలో పుట్టిన వాళ్లకి, కొత్త విషయాలను తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. మీడియా, టీవీ, సినిమా రంగంలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి కమ్యూనికేటర్స్ గా ఉంటారు వీళ్ళు. అలానే, విలాసవంతమైన పరిసరాలు మధ్య ఉంటారు. వ్యాపారంలో కూడా సక్సెస్ అందుకుంటారు. వీళ్ళకి 24 నుండి 27 సంవత్సరాల మధ్య అదృష్ట కాలం. కళాత్మ రంగం లో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయి.
ఎక్కువగా, వీళ్ళు నిశ్శబ్దాన్ని ఇష్ట పడతారు. అలానే, వీళ్ళు బాధ్యతగా ఉంటారు. మంచి టీం లీడర్లుగా కూడా వ్యవహరిస్తారు. లక్ష్యాలను సాధించడానికి ఎంత కష్టమైనా వెనుకడుగు వెయ్యరు. వీళ్ళ ప్రయత్నానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఈ టైంలో పుట్టిన వాళ్ళు, ఉన్నత స్థాయిలో ఉంటారు. సంపదని కూడా బాగా సృష్టిస్తారు. బోధన నైపుణ్యాలు ఉంటాయి. బాధ్యతగా ఉంటారు.
జన్మ స్థలానికి, దూరంగా ఉన్న ప్రదేశంలో అభివృద్ధి చెందుతారు. విజయవంతమైన వ్యాపారవేత్త అవుతారు. వీళ్లు కోచ్ గా, గైడ్ గా, కౌన్సిలర్ గా కూడా రాణించొచ్చు. అలానే, ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది. విజయం, కీర్తి, ఆనందాన్ని సాధించడానికి వీళ్ళు ముందుంటారు.