Lord Surya Dev : సూర్యుడు లేకపోతే మనం లేము. చాలా మంది సూర్య భగవానుడిని ఆరాధిస్తూ ఉంటారు. సూర్య భగవానుడిని ప్రార్థిస్తే ఖచ్చితంగా అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆయన అనుగ్రహం లభిస్తే సంతోషంగా జీవించొచ్చు. ఆదిత్యుని అనుగ్రహం పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. సులభంగా సూర్యుడు అనుగ్రహం ని మనం పొందచ్చు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు స్నానం చేసి, పనులన్నీ పూర్తి చేసుకుని సూర్యునికి నమస్కారం చేసుకోవాలి.
సూర్యుని అనుగ్రహాన్ని పొందాలంటే బ్రహ్మ పురాణంలో కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే మంచిది. సూర్యుని అనుగ్రహం పొందడానికి మాఘశుద్ధ షష్టి లేదా సప్తమి నాడు ఏకభుక్తో వ్రత నియమాలని పాటించి, సూర్యుడిని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది. సప్తమి రోజు ఉపవాసం చేస్తూ సూర్యుడిని పూజిస్తే పరమూత్కృష్ట గతులని పొందుతారు. శుక్ల సప్తమి నాడు ఉపవాసం చేసి తెల్లని ద్రవ్యాలతో పూజ చేయడం వలన సకల పాపాలు పోతాయి.
శుక్ల సప్తమి ఆదివారం కలిసి వస్తే దాన్ని విజయ సప్తమి అంటారు. ఆరోజు స్నాన, దాన, తప, హోమ, ఉపవాసాధులు మహా పాతకాలను సైతం నశింపచేస్తాయి. రోజు క్రమం తప్పకుండా సూర్యుడికి దీపం పెట్టి సమర్పించిన వారు జ్ఞాన దీపంతో ప్రకాశిస్తారు. నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ సూర్యుడికి దీపాన్ని పెడితే కంటికి సంబంధిత అనారోగ్య సమస్యలు పోతాయి. ఎర్ర చందనంతో ఎర్రటి పూలను సూర్యుడికి పెడితే ఏడాదిలోనే సూర్య అనుగ్రహాన్ని పొందొచ్చు.
నేతితో సూర్యునికి తర్పణాలు చేస్తే సర్వసిద్ధులు కలుగుతాయి. పాలతో తర్పణాలు చేస్తే మానసిక సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. పెరుగుతో తర్పణాలు చేస్తే మనం అనుకున్న పనులు పూర్తవుతాయి. పాయసాన్ని, అప్పాలు, పండ్లు, కందమూలములని, నేతితో చేసిన వంటకాలనీ సూర్యుడికి పెడితే కోరికలు నెరవేరుతాయి. తల భూమిని తాకే విధంగా సూర్యుడికి నమస్కారం చెప్పే సకల పాపాలు పోతాయి. సూర్యుడికి భక్తితో ఏ ద్రవ్యాలను సమర్పిస్తే అవన్నీ కూడా తిరిగి మనకి లభిస్తాయి.