Panic Attack : కొందరు తీవ్రమైన ఆందోళన, తెలియని భయం, అతి కోపం మరియు సంతోషంతో కొన్ని సమయాలలో పానిక్ ఎటాక్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ పానిక్ ఎటాక్ కలిగినప్పుడు మానసిక స్థితి అయోమయంగా అయిపోతుంది. ఈ అయోమయ స్థితి వచ్చినప్పుడే మనిషి నియంత్రణ కోల్పోయి కాస్త పానిక్ ఎటాక్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా పానిక్ ఎటాక్ వచ్చినప్పుడు వెంటనే అధికంగా చెమటలు పట్టేస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కొంతమంది కళ్ళు తిరిగి సడన్ గా పడిపోతారు. ఒక వ్యక్తి పానిక్ ఎటాక్ కు గురైనప్పుడు వాంతులు అవుతున్నట్లు అనిపించడం, కాళ్లు, చేతులు అధికంగా వణకడం, ఒక్కోసారి ఛాతిలో నొప్పిగా అనిపించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో లాస్ ఆఫ్ బాడీ కంట్రోల్ మెయిన్ గా జరుగుతుంది.
ఈ పానిక్ ఎటాక్ వచ్చిన వారిని వెంటనే ఖాళీ ప్రదేశంలో ఉంచాలి. వారు ఉండే ప్రదేశంలో తక్కువ వెలుతురు ఉండేలా చూసుకోవాలి. వాళ్లను షాక్ కి గురి చేసే విషయాలు వాళ్ల దగ్గర ప్రస్తావించకూడదు. పానిక్ ఎటాక్ గురైన వ్యక్తికి భారీ శబ్దాలు వినిపించకుండా జాగ్రత్త వహించాలి. ఛాతిలో నొప్పి, చెమట తగ్గి సాధారణ స్థితికి రాగానే వాళ్లకి కొబ్బరి నీళ్లు గాని, నిమ్మకాయ, తేనె కలిపిన నీటిని గాని తాగించాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. వాళ్ళు ధైర్యంగా ఉండడానికి కాస్త పాజిటివ్ గా మాట్లాడి ఓదార్చి నాలుగు మంచి మాటలతో ఆ వ్యక్తి సాధారణ స్థితికి వచ్చే వరకు జాగ్రత్త వహించాలి. ఇలా చేస్తే శరీరం మొత్తం 5-10 నిమిషాల్లో ఫ్రీ అయిపోతుంది. కొంత మందికి సైకలాజికల్ గా జనాలు ఎక్కువగా గుంపులుగా ఉన్నప్పుడు వాళ్లకి పానిక్ ఎటాక్ వస్తుంది. అదేవిధంగా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఇలా అనిపిస్తుంది.
ఇలాంటి వారు హోమియో మెడిసిన్ వాడడం మంచిది. ఇలా అతి భయం, అతి కోపం, అతి సంతోషం వచ్చేవాళ్ళు మాత్రం రెగ్యులర్ గా మెడిటేషన్, ప్రాణాయామం చేయడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే పానిక్ ఎటాక్ తో ఇబ్బంది పడేవారు పాజిటివ్ థింకింగ్ లో ఉండడం, సెలీనియం ఎక్కువగా ఉండే బ్రెజిల్ నట్స్ వంటివి నిత్యం ఆహారంలో తీసుకోవడం మంచిది. అదేవిధంగా ఫ్రూట్స్, నట్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వలన పేగుల్లో సెరటోనిన్ ప్రొడక్షన్ బాగా ఉంటుంది. నలుగురితో హ్యాపీగా ఉంటే డోపామిన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఇలా చేయటం వలన పానిక్ ఎటాక్ రాకుండా రక్షించుకోవచ్చు.