చాలీచాలని జీతంతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే టెన్షన్ పడకండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ఇండియా (SBI) ATM ఫ్రాంచైజ్ బిజినెస్ ద్వారా నెలకు 70 వేల రూపాయాలు సంపాదించే అవకాశం ఉంది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు ఇంటి నుండే సంపాదించుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఎలా అంటే.. మీరు ఎస్‌బిఐ ఏటిఎం (SBI ATM) ఫ్రాంచైజీని తీసుకోవడం ద్వారా ప్రతి నెల పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు. ఇంకా దీని కోసం మీరు పెద్దగా చేయవలసిన అవసరం లేదు. దీని ద్వారా మీరు ఇంట్లో కూర్చోని ఏకంగా నెలకు రూ.70 వేల వరకు సులభంగా పొందవచ్చు.
అలాగే మీరు మీకు నచ్చిన ఏటీఎం ఫ్రాంచైజీ కూడా తీసుకోవచ్చు. ఇండీక్యాష్, ముత్తూట్ ఏటీఎం, ఇండియా వన్ ఏటీఎం వంటివి ఏటీఎంలను ఏర్పాటు చేస్తాయి. మీరు కూడా ఈ కంపెనీలతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని, వాటి ద్వారా ఏటీఎంల ఏర్పాటు చేసుకోవచ్చు. ఏటీఎం ఏర్పాటు చేయాలంటే.. ముందుగా స్థలం కావాలి. 50 నుంచి 80 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలి. ఇతర ఏటీఎంలకు 100 మీటర్ల దూరం ఉండాలి. 24 గంటల పవర్ సప్లై చాలా అవసరం. 1 కిలోవాట్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అవసరం అవుతుంది. ఏటీఎం ద్వారా రోజుకు 300 ట్రాన్సాక్షన్లు జరిగే స్థలాన్ని ఎంచుకోవడం ఉత్తమం.
ఏటీఎం పై భాగం కాంక్రీట్ తో ఉండాలి. వీ- స్యాట్ (V-SAT) ని ఇన్‌స్టాల్ చేయడానికి లేదా ATM ఉన్న సొసైటీ నుండి నో-ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరి. అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి ఐడీ ప్రూఫ్, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్, ఫోటోగ్రాఫ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. బ్యాంకులు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకొని ఏటీఎంలను ఏర్పాటు చేస్తుంటాయి. ఇందుకోసం మీరు రూ.2 లక్షల సెక్యూరిటీ డిపాజిట్, రూ.3 లక్షల ఏటీఎం క్యాష్ పెట్టుకుంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. దీంతో మీరు సులభంగా నెలకు 70 వేలు ఇంట్లో కూర్చోనే సంపాదించవచ్చు.