Balakrishna : ఒకప్పుడు హీరోలకు, హీరోయిన్లుకు సినిమాల ద్వారా వచ్చే రెమ్యూనరేషన్ మాత్రమే ఆదాయ వనరుగా ఉండేది. అయితే ఇప్పుడు సెలబ్రెటీలు అనేక మార్గాలుగా డబ్బు సంపాదిస్తున్నారు. తమకు ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకుని కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వారు చాలామంది ఉన్నారు. కొందరు హీరోలు సినిమాల కంటే ఇతర మార్గాల ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఉదాహరణకు రూ.50 కోట్లను సినిమాల ద్వారా సంపాదిస్తే.. కమర్షియల్ యాడ్స్‌లో నటించడం ద్వారా అంతకు మించి ఆదాయాన్ని దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్‌బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ యాడ్స్ చేస్తున్నారు.
ఇతర హీరోలు 1, 2 కమర్షియల్ యాడ్స్ చేస్తున్నారు. కానీ కొందరు హీరోలు మాత్రం ఇప్పటి వరకు కనీసం ఒక్కటి అంటే ఒక్క కమర్షియల్ యాడ్‌ను కూడా చేయలేదు. కోట్ల పారితోషికాన్ని కూడా కాదు అని కమర్షియల్ యాడ్స్‌కు నో చెబుతున్నారు. అందులో నందమూరి బాలకృష్ణ ఒకరు. 1990లో బాలయ్య వద్దకు కమర్షియల్ యాడ్స్ ప్రపోజల్ వచ్చిందట. ఆ సమయంలో బాలయ్య ఇండస్ట్రీలో టాప్ హీరో అనే విషయం తెలిసిందే. భారీ పారితోషికం ఇవ్వడానికి ఓ కంపెనీ ముందుకు వచ్చినా కానీ బాలయ్య మాత్రం కమర్షియల్ యాడ్స్‌ను చేసే ఉద్దేశం లేదని నిర్మోహమాటంగా చెప్పేశారట.
కేవలం అప్పుడు మాత్రమే కాదు.. ఆ తరువాత ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలని కోరాయట. కానీ బాలయ్య మాత్రం ఏ ఒక్క బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి ఆసక్తి చూపలేదు. బాలయ్యకు జనాలను మోసం చేయడం ఇష్టం లేక ఆ ప్రచార వీడియోల్లో నటించడానికి నో చెప్పారట. ఆయన సన్నిహితులు ఏమంటున్నారంటే.. ఏదైనా ఒక ఉత్పత్తి గురించి మాట్లాడాలంటే అందులో 100 శాతం నిజం ఉండదు. కనుక జనాలను మోసం చేస్తూ.. డబ్బు సంపాదించడం ఇష్టం లేదు కాబట్టే బాలయ్య బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించలేదట. ఇలా ఎంతమంది హీరోలుంటారు చెప్పండి.. బాలయ్య చేస్తున్న ఈ మంచి పనికి నందమూరి ఫ్యాన్స్ గర్వపడుతున్నారు.