Juices : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని, అందుకోసం తగిన పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. నిజానికి, మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే, ఇలా చేయడం మంచిది. ఉదయం ఈ పానీయాలు తాగితే, పూర్తిగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ, పనిలో పడిపోయి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టట్లేదు. దీని వలన చిన్న వయసులోనే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనిని నివారించడానికి, కొన్ని ఇంటి చిట్కాలు మీకు బాగా ఉపయోగపడతాయి. దీర్ఘకాలిక రోగాలు ఇబ్బంది వలన చాలా సతమతమవ్వాలి.
ఉదయం లేవగానే, ఖాళీ కడుపుతో కొన్ని పానీయాలు తీసుకుంటే, ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రతిరోజు ఒక గ్లాసు, గోరువెచ్చని నిమ్మరసం తో మీ రోజుని స్టార్ట్ చేయండి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. నిమ్మకాయలులో పోషకాలు బాగా ఉంటాయి. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. ఉదయం పూట క్రాన్ బెర్రీ జ్యూస్ తాగితే కూడా, ఆరోగ్యము బాగుంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. పోషకాలు కూడా ఉంటాయి. హృదయ సంబంధిత సమస్యలు రాకుండా చూస్తాయి.
ఉదయాన్నే పాలల్లో పసుపు వేసుకుని తీసుకుంటే, రోగి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయాన్నే ఈ పాలు తాగడం వలన, కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా ఉండవు. ఉదయాన్నే గ్రీన్ టీ తీసుకుంటే కూడా మంచిది. ఖాళీ కడుపుతో, గ్రీన్ టీ తాగితే, కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అలానే, ఉదయాన్నే బీట్రూట్ జ్యూస్ తో మీరు దీన్ని స్టార్ట్ చేస్తే కూడా మీ ఆరోగ్యం బాగుంటుంది.
బీట్రూట్లో కూడా పోషకాలు బాగా ఉంటాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. రోజు ఉదయాన్నే ఒక గ్లాసులో కొన్ని చుక్కలు ఆపిల్ సైడర్ వెనిగర్ వేసుకుని తీసుకుంటే, కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది. ఇలా ఉదయాన్నే వీటిని తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. చాలా రకాల సమస్యలకి పరిష్కారం ఉంటుంది.