Noodles : ప్రస్తుతం నడుస్తున్నది ఫాస్ట్ యుగం. ఈ వేగవంతమైన టెక్నాలజీ జనరేషన్‌లో ప్రతిది చాలా స్పీడ్‌గా అయిపోతుంది. ప్రజలు అన్ని పనులు వేగంగా కావాలని చూస్తున్నారు. అన్నింటా వేగం పెరిగింది. టెక్నాలజీ కూడా అంతే వేగంగా మారుతోంది. అందుకనే ఆహారం విషయంలోనూ ప్రజలు వేగాన్ని కోరుకుంటున్నారు. సరిగ్గా 1 గంటపాటు కూర్చుని తినేందుకు కూడా సమయం కేటాయించడం లేదు. దీంతో ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడిపోతున్నారు. ఫలితంగా ఆరోగ్యం దెబ్బ తింటోంది. ఇలా ఆరోగ్యం దెబ్బ తినేందుకు కారణం అవుతున్న వాటిల్లో నూడుల్స్ కూడా ఒకటి.
నూడుల్స్ ను చాలా స్పీడ్‌గా తయారు చేయవచ్చు. వీటిని బ్రేక్‌ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్‌లోనూ తినవచ్చు. అందుకనే వాటికి అంతటి ప్రాముఖ్యత ఏర్పడింది. త్వరగా తయారు చేయవచ్చు, ఫాస్ట్‌గా తినవచ్చు. అందుకనే చాలా మంది నూడుల్స్‌ను తింటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో రెడీ టు ఈట్ నూడుల్స్ కూడా వచ్చాయి. అందులో కాస్త వేడి నీళ్లు జోడిస్తే చాలు ఆ నూడుల్స్ రెడీ అయిపోతాయి. వాటిని తినవచ్చు. అయితే ఇలాంటి నూడుల్స్ వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రెడీ టు ఈట్ లేదా ఇతర ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను తినడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పేరుకుపోతాయి. దీంతో కిడ్నీలపై భారం పడుతుంది. దీర్ఘకాలంలో ఇది కిడ్నీల ఫెయిల్యూర్‌కు దారి తీయవచ్చు. అలాగే దీని వల్ల కిడ్నీ స్టోన్లు ఏర్పడే చాన్స్ కూడా ఉంటుంది. నూడుల్స్‌లో ఆగ్జలేట్స్ కలుపుతారు. ఇవి మన శరీరంలో క్యాల్షియంతో కలిసి స్టోన్లను ఏర్పడేలా చేస్తాయి. అలాగే నూడుల్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు కలిపే మోనోసోడియం గ్లూటమేట్ (ఎంఎస్‌జీ) మన ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. ముఖ్యంగా దీంతో కిడ్నీ స్టోన్లు ఏర్పడే చాన్స్ ఉంటుంది. అలాగే హైబీపీ పెరిగి గుండె పోటు కూడా రావచ్చు. కనుక నూడుల్స్‌ను అతిగా తింటున్నవారు జాగ్రత్తగా ఉండాల్సిందే.