డయాబెటిస్ ఉన్నవారు కింద తెలిపిన చిట్కాను పాటించి చూడవచ్చు. దీన్ని మా అమ్మ పరీక్షించి చూసింది. ఉత్తమ ఫలితాలు వచ్చాయి. యోగా గురువు బాబా రామ్‌దేవ్ చెప్పిన చిట్కా ఇది. ఈ చిట్కాను పాటించి మా అమ్మ డయాబెటిస్ నుంచి బయట పడింది. మీక్కూడా చిట్కా ఉపయోగపడవచ్చు.
కరివేపాకులు
ఉదయాన్నే పరగడుపునే 10 కరివేపాకులను తీసుకుని అలాగే నమిలి మింగాలి.
సదాబహార్ పువ్వులు
ఉదయం అల్పాహారం చేసిన వెంటనే వీటిని తినాలి. 5 నుంచి 6 సదాబహార్ పువ్వులను అలాగే తినవచ్చు. పింక్ లేదా తెలుపు ఏ రకం పువ్వులు అయినా సరే పనిచేస్తాయి. వాటిని తిన్న వెంటనే నీటిని తాగాలి. ఇవి చాలా చేదుగా ఉంటాయి.
యోగా, తేలికపాటి వ్యాయామాలు, వాకింగ్ చేయాలి.
మా అమ్మ డయాబెటిస్‌కు ఎలాంటి మెడిసిన్‌ను తీసుకోకుండానే ఈ చిట్కాలను పాటించింది. ఇవి బాగా పనిచేశాయి. ఒక వారంలోనే ఫలితం వస్తుంది.
గమనిక: పైన తెలిపింది ఒక మాతృమూర్తి స్వీయ అనుభవం. అందరికీ అన్ని చిట్కాలు పనిచేయకపోవచ్చు. కేవలం సమాచారం కోసం మాత్రమే పైన వివరాలను ఇవ్వడం జరిగింది. పాటించే ముందు ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించగలరని మనవి.