Giribabu Son Bosubabu : తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది నటీనటులు తమ ప్రదర్శనతో ప్రేక్షకుల మెప్పు పొందారు. వారిలో గిరిబాబు కూడా ఒకరు. ఎన్నో సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈయన మూడు తరాల నటులతో కలిసి నటించి మెప్పించారు. ఈ తరం హీరోలలో ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి హీరోలతో పనిచేయలేదు, కానీ విజయ దేవరకొండతో కలిసి నటించారు. గిరిబాబు పెద్ద కుమారుడు రఘుబాబు మంచి నటుడు , కమెడీయన్ అని మనందరికి తెలుసు. ఆయన కూడా వందల చిత్రాలలో నటించి నటుడుగా కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటికీ పలు చిత్రాలలో కమెడియన్ గా నటిస్తూ బిజీగానే ఉన్నారు.
గిరిబాబు మరోకుమారుడు బోసుబాబు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వగా, గిరిబాబు స్వీయ నిర్మాణంలో ఇంద్రజిత్ అనే సినిమాతో పలకరించాడు. కాగా ఈ సినిమా చిరంజీవి హీరోగా నటించిన కొదమసింహం సినిమా రెండూ ఒక నెల అటూ ఇటూగా విడుదలయ్యాయి. రెండు సినిమాల్లోనూ కథ దాదాపుగా ఒకే విధంగా కనిపించడంతో ఈ సినిమాను కొన్న బయ్యర్లు ఆందోళన చేశారు. అంతే కాకుండా సగం డబ్బులను వెనక్కి తీసుకున్నారు. అలా జరగటంతో బయ్యర్లు లాభపడ్డారు కానీ నిర్మించిన గిరిబాబు చాలా నష్టపోయారు.
అప్పట్లో ఈ సినిమా విషయంలో కుట్ర జరిగిందని కూడా పలు వార్తలు వచ్చాయి. ఓ ఇంటర్యూలో ఆ విషయాన్ని బోసు బాబు చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా తరవాత రెండు మూడు సినిమాలు చేసినా బోసుబాబుకు సరైన హిట్ రాకపోవడం, తరవాత విలన్ గా నటించగా ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ లో చమ్మా చక్కా అనే సినిమాలో హీరోగా కూడా నటించారు బోసు బాబు. ఇక ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఆయనకు సినీ ఇండస్ట్రీలో గుర్తింపు దక్కలేదు.