చిత్ర పరిశ్రమలో ఎంతో మంది స్టార్లు చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చారు. చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఓ పెద్ద హిట్ కొడితేనే… వారి పేరు జనం నోట్లో ఆడుతుంది. లేకపోతే వారి పేర్లు కూడా ఎవరు గుర్తుంచుకోరు. అయితే ఇలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొంత మంది హీరోయిన్లు.. పరిశ్రమలోకి వచ్చి తమ ప్రతిభను చాటి..అందరికీ దగ్గరయ్యారు. ముఖ్యంగా సౌందర్య, రోజా, రంభ, రాశి, అనుష్క ఈ హీరోయిన్స్ మనందరికీ తెలుసు.
కానీ ఇవి వాళ్ళ అసలు పేర్లు కావు. సినిమాల్లోకి వచ్చాక డైరెక్టర్స్ క్యాచీగా ఉండేలా ఈ స్క్రీన్ నేమ్స్ ను పెట్టారు. అవే బాగుండడంతో ఆ హీరోయిన్స్ కూడా అసలు పేర్లను పక్కకు పెట్టి సినిమా పేర్లతోనే కంటిన్యూ అవుతున్నారు. మరి ఇంతకీ వీళ్ళ అసలు పేర్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం!
సౌందర్య:
సౌందర్య అసలు పేరు సౌమ్య. కర్ణాటకలో పుట్టిన సౌమ్య సినిమాల్లోకి వచ్చాక తన పేరును సౌందర్యగా మార్చుకుంది.
రోజా:
రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. శ్రీలత పేరుతో ఇంతకు ముందే ఒక నటి ఉండడంతో రోజా అని పేరు పెట్టుకుంది.
రంభ:
రంభ అసలు పేరు విజయలక్ష్మి. విజయవాడలో పుట్టిన రంభ 90 లలో గ్లామర్ క్వీన్ గా టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకుంది.
రాశి:
రాశి అసలు పేరు మంత్ర. సినిమాల్లోకి వచ్చాక రాశి గా మారింది.
అనుష్క శెట్టి:
అసలు పేరు స్వీటీ శెట్టి. ఈమెది కర్ణాటక.