Gold Mine : ఒడిశాలోని మూడు జిల్లాలలో బంగారు నిల్వలు బయటపడ్డాయి. రాష్ట్రంలోని కియోంఝర్ జిల్లా, మయూర్‌భంజ్, డియోగఢ్ జిల్లాల్లో గనులను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా , డైరెక్టరేట్ ఆఫ్ మైన్‌కు చెందిన సర్వేయర్లు గుర్తించారని గతంలో అప్పటి ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించింది. కియోంజఝర్ జిల్లాలో నాలుగు చోట్ల గనులు బయటపడగా, మయూర్‌భంజ్‌లో నాలుగు, డియోగఢ్ జిల్లాలో ఒక చోట బంగారు గనులను గుర్తించారని స్పష్టం చేసింది.
దేశంలో మొట్టమొదటిసారిగా లిథియం నిల్వలను జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ) గుర్తించిందని అప్పటి కేంద్ర గనుల శాఖ 2023 ఫిబ్రవరి 10న ప్రకటించగా, జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో గల సలాల్-హైమనా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలను గుర్తించినట్టు తెలియజేశారు. ఇప్పుడిప్పుడే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలు భావిస్తున్న నేపథ్యంలో లిథియం నిల్వలు లభించడం శుభ పరిణామం అని అందరు భావించారు. కాగా, బంగారం, లిథియం సహా మొత్తం 51 గనులను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించినట్టు గనుల శాఖ అప్పట్లో స్పష్టం చేసింది.
మూడు జిల్లాల్లో బంగారు గనులు బయట పడటం స్థానికులను కలవర పరుస్తోంది. గనులు సాకులు చూపి తమ భూములు లాక్కుంటారేమో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 51 ఖనిజ క్షేత్రాలను ప్రభుత్వం గుర్తించగా, వీటిల్లో 5 ప్రాంతాల్లో బంగారం నిల్వలు కాగా, మిగిలిన చోట్ల పొటాష్, మాలిబ్డినం, ఇతర బేస్ మూలకాలకు చెందిన నిక్షేపాలను గుర్తించినట్లు తెలియజేసింది.. జమ్ముకశ్మీర్‌తో పాటు ఏపీ, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ నిక్షేపాలు ఉన్నట్లు అప్పట్లోనే గనులశాఖ ఓ ప్రకటన చేసింది. అయితే దీనిపై తరువాత సమాచారం లేదు.