సాధారణంగా ఏ థియేటర్లలోనో లేదా ఇంటి దగ్గర సినిమాలను చూసేటప్పుడు మనము ఎక్కువగా తీసుకునే స్నాక్స్ పాప్-కార్న్. అయితే ఒక కప్పు పాప్ కార్న్‌లో ఒక గ్రామ్ ఫైబర్ ఉంటుంది. కనుక రోజుకు నాలుగు కప్పుల వరకు పాప్ కార్న్ తిన్నా చాలు. దాంతో నాలుగు గ్రాముల వరకు ఫైబర్ అందుతుంది. తద్వారా జీర్ణ సమస్యలు పోతాయి.
పాప్కార్న్ వయస్సు పెరగడం వల్ల వచ్చే ముడుతలను, వయసు మచ్చలను, మాక్యులార్ డిజెనరేషన్ వల్ల వచ్చే అంధత్వమును, కండరాల బలహీనత మరియు జుట్టు ఊడిపోవడం వంటి వయస్సు-ఆధారిత లక్షణాలకు చికిత్సను చేయవచ్చు.
పాప్ కార్న్‌లో ఉన్న శక్తివంతమైన అనామ్లజనకాలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పాప్ కార్న్‌లో అధిక మోతాదులో మాంగనీస్ ఉంది. ఇది బలమైన మరియు ఆరోగ్యకరమైన ఎముకలను నిర్మించి, అదే స్థాయిలో వాటి దృఢత్వాన్ని కొనసాగేలా ఉంచడానికి సహాయపడుతుంది. పాప్ కార్న్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మరియు క్యాన్సర్ ను నిరోధించటంలో కూడా పాప్ కార్న్ ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది.