Akhil : అక్కినేని అఖిల్.. నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ప్రతి సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేస్తున్నప్పటికీ మనోడికి సరైన సక్సెస్ రావడం లేదు. ఏజెంట్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో మలయాళ స్టా్ర్ మమ్ముట్టి కీలకపాత్రలో నటించగా, ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. ఇందులో సిక్స్ ప్యాక్ బాడీతోపాటు.. మాస్ లుక్ లో కనిపించారు. కానీ ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది.
అఖిల్ చైల్డ్ ఆర్టిస్టుగానే సినీ ఎంట్రీ ఇచ్చాడు. సిసింద్రీ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే హీరోగా అఖిల్ సినిమా పేరుతోనే వెండితెరకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ విజయం సాధించలేకపోయింది. అనంతరం మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ వంటి సినిమాలను చేశారు. ఇవేవీ సక్సెస్ కాలేదు. ఏజెంట్ తప్పక విజయం సాధిస్తుందని అనుకున్నారు. కాని ఏకంగా సినీ నిర్మాతే మా సినిమా ఫెయిల్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అసలు అఖిల్ సినిమాలకు ఏమైంది? అన్న చర్చ ప్రారంభమైంది.
అయితే అఖిల్ సినిమాలు ఫ్లాప్ కావడానికి కారణం ఇదనేంటూ ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది. నాగేశ్వర్ రావు నుంచి నాగ చైతన్య వరకు ప్రతీ పేరులో ‘నాగ’ వచ్చింది. అంటే నాగమ్మ దయతో తమ కుటుంబం చల్లగా ఉంటుందని భావించి అందరికి అలా పెట్టినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే అఖిల్ విషయానికొచ్చేసరికి మాత్రం నాగ కనిపించదు. అఖిల్ పేరులో నాగ లేకపోవడం వల్లే ఆయనకు సినీ కష్టాలు వస్తున్నాయని కొందరు అంటున్నారు. తన అన్న నాగ చైతన్య పెద్ద స్టార్ కాకపోయినా కొన్ని సినిమాలు అయితే కలిసి వచ్చాయి. అఖిల్‌కి అది కూడా లేదని దాని వల్లనే మనోడి కెరియర్ ముందుకు సాగడం లేదని టాక్.