Gajala : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన ప్రతి సినిమాకి తన క్రేజ్ పెంచుకుంటూ పోతున్నారు. ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న ఎన్టీఆర్ … కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 చేస్తున్నాడు. ఇక బాలీవుడ్ చిత్రం వార్ 2లోను ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇక హాలీవుడ్ చిత్రంలోను నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే ఎన్టీఆర్ కోసం ఓహీరోయిన్ ఆత్మహత్యకి ప్రయత్నించిందనే విషయం ఎంత మందికి తెలుసు.
ఒకప్పుడు హీరోయిన్ గజాలా తెలుగమ్మాయిగా ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంది.ఈ అమ్మడు తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటించింది.ఎంత త్వరగా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుందో అంతే తొందరగా ఇండస్ట్రీకి గుడ్ బై కూడా చెప్పేసింది. తొలిసారిగా 2001లో జగపతిబాబు హీరోగా నటించిన నాలో ఉన్న ప్రేమ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ఈ చిత్రం తర్వాత ఓ చిన్నదాన, విజయం, అల్లరి రాముడు ఇలా పలు సినిమాలలో నటించగా, స్టూడెంట్ నెంబర్ వన్, కలుసుకోవాలని అనే రెండు సినిమాలు మంచి గుర్తింపును అందించాయి. అనంతరం జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.
మంచి ఫామ్ లో ఉన్న సమయంలో గజాలా సినీ ఇండస్ట్రీకి దూరమైంది.ఆ సమయంలో తను ఎందుకు దూరమైందో అన్న ప్రశ్నలు చాలామందిలో ఎదురయ్యాయి. అయితే ఈమె గతంలో ఆత్మహత్య ప్రయత్నం చేసిందన్న విషయం బాగా సంచలనం రేపింది. కొన్ని సంవత్సరాల కిందట తను హైదరాబాదులో ఒక అతిథి గృహంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేసిందని, ఆ సమయంలో తోటి నటులు సుల్తానా, అర్జున్ సరైన సమయానికి ఆమెను ఆసుపత్రికి తరలించటంతో బతికిందని టాక్. అయితే ఒక హీరో మోసం చేశాడన్న విషయంతో ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని అప్పట్లో బాగా ప్రచారం సాగింది . దాంతో పాటు ఎన్టీఆర్ పై ఎక్కువ ప్రేమను పెంచుకున్న గజాల ఆయన సినిమాలో నటించే ఛాన్స్ ఇవ్వకపోతే తనకు హిట్స్ పడవని లేకపోతే సూసైడ్ చేసుకుంటాను అని బలవంతంగా బాత్రూంలోకి వెళ్లి ఫినాయిల్ తాగిందని అన్నారు.