సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిన వారు ఎవరంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు.. మోనీ భోంస్లే అలియాస్ మోనాలిసా. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభ మేళాలో ఈమె కనిపించి అందరినీ తనవైపు తిప్పుకునేలా చేసింది. ఇండోర్‌కు చెందిన ఈమె కుంభ మేళాలో పూసలు అమ్ముతూ కెమెరాలకు చిక్కింది. దీంతో ఆమె ఫొటోలకు చాలా మంది ఫిదా అయిపోయారు. ఆమె కళ్లు, చూపులకు, స్కిన్ టోన్‌కు దాసోహం అయ్యారు. దీంతో ఆమె ఓవర్ నైట్ సెన్సేషన్‌గా మారింది. ఆమెకు చాలా మంది ఫ్యాన్స్ పుట్టుకొచ్చేశారు. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.
ఇలా మోనాలిసా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. దీంతో ఆమెను చాలా మంది ఇంటర్వ్యూ చేసేందుకు, ఆమెతో ఫొటోలు దిగేందుకు వచ్చారు. అయితే ఈ ధ్యాసలో పడి పని మరిచిపోవడంతో తన తండ్రి ఆమెను తిరిగి స్వస్థలానికి పంపేశాడు. అయితే మళ్లీ వచ్చే కుంభ మేళాలో అయినా కనిపిస్తానని మోనాలిసా ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఇక ఈ 10 రోజుల్లో ఆమె రూ.10 కోట్లు సంపాదించిందని కొందరు సోషల్ మీడియాలో ప్రయారం చేయడం మొదలు పెట్టారు. అయితే ఈ వార్తను మోనాలిసా ఖండించింది.
రూ.10 కోట్ల సంపాదిస్తే తాను పూసలు ఎందుకు అమ్ముకుంటానని, ఇలాంటి వార్తలను సృష్టించొద్దని, వీటిని నమ్మొద్దని ఆమె కోరింది. అయితే మోనాలిసాకు బాలీవుడ్‌లో ఆఫర్ వచ్చిందని కూడా వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. మరి మోనాలిసా భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.