టాలీవుడ్ స్టార్ హీరో కళ్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత మూవీ బింబిసార తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. నూతన దర్శకుడు వశిష్ట డైరెక్షన్ లో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో, టైం ట్రావెల్ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాల నడుమ విడుదల అయింది. కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా విజయంలో కీరవాణి అందించిన సంగీతం పెద్ద యాసెట్ గా నిలిచింది.
అయితే బింబిసార సినిమాను తీసే ముందు దర్శకుడు వశిష్టు కళ్యాణ్ రామ్ కన్నా ముందే పలువురు తెలుగు హీరోలను కలిశారట. ఈ చిత్రానికి ముందు యంగ్ హీరోలైన నితిన్, రామ్, రాజ్ తరుణ్, అల్లు శిరీష్ లను కలిశాడట వశిష్టు. అయితే వారెవరు తనతో చిత్రాలు చేయడానికి ముందుకు రాలేదట. నందమూరి కళ్యాణ్ రామ్ నమ్మడమే కాకుండా దాదాపు 15 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టాడు.
ఆ రోజు ఆ రిస్కు ఫలితాలను అందించింది. బింబిసార తో నందమూరి కళ్యాణ్ రామ్ కు సూపర్ హిట్ ను అందించాడు దర్శకుడు వశిష్టు. ఈ సినిమా రికార్డులను తిరగరాసింది. మొదటి వీకెండ్ లోనే బింబిసార బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. ఇక ఐదు రోజుల్లో ఈ చిత్రం దాదాపుగా 23 కోట్ల రూపాయలను ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. బింబిసార లో కళ్యాణ్ రామ్ రాజుగా, సాధారణ వ్యక్తిగా కళ్యాణ్ రామ్ ఆహార్యం బాగుంది. మొత్తంగా కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో చేయనటువంటి ఛాలెంజింగ్ పాత్రను బింబిసార లో చేశాడు. అయితే కళ్యాణ్ రామ్ నటనతో పాటు వశిష్టు డైరెక్షన్ కు కూడా పలువురు ప్రశంసలు దక్కాయి.