ఎన్నో నెలల నిరీక్షణ, ఎన్నో ఆశలు, భారీ బడ్జెట్ అన్నిటికీ మించి పూరి జగన్నాథ్ డైరెక్షన్ ఇన్ని హంగులు కలిపిన సినిమా అంటే అభిమానులకు ఎన్నో ఆశలు ఉంటాయి. రౌడీ హీరో ఈ సినిమాలో సరికొత్త లుక్ లో బాక్సింగ్ నేపథ్యంలో రావడంతో, రోజురోజుకు అభిమానుల నిరీక్షణ పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని ఎదురు చూశారు. దీంతో మూవీ థియేటర్లోకి రానే వచ్చింది.కానీ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. లైగర్ సినిమా ఫ్లాప్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మూవీ ఈవెంట్ లలో ఇండియా షేక్ కాబోతోంది అంటూ విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగులు గుర్తుండే ఉంటాయి. దీంతో విజయ్ దేవరకొండ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్నాడు అంటూ ఎంతో హడావిడి నడిచింది.
ఎట్టకేలకు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ పై ఆడియన్స్ పెదవి విరిచారు. స్క్రీన్ ప్లేస్ స్లోగా ఉందని, అసలు కథ లేదని మొహం చాటేశారు. అయితే టాక్ కు సంబంధం లేకుండా తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 13.45 కోట్లను వసూలు చేసింది. అయితే లైగర్ ను ప్రేక్షకులు మెప్పించకపోవడానికి గల ఐదు కారణాలను ఏంటో చూద్దాం. మొదటగా విజయ్ తల్లి బాలామణి పాత్రలో రమ్యకృష్ణ నటించగా ఆమె పవర్ఫుల్ రోల్ పడితే అదరగొట్టేస్తారు కానీ లైగర్ లో ఆమె పాత్ర గోలగోలగా ఉందని టాక్ వినిపించింది. విజయ్ దేవరకొండ తో మదర్ సెంటిమెంట్ సన్నివేశాలు అంతగా పండలేదు. ఆమె పాత్ర ఎమోషన్ కు అంతగా కనెక్ట్ కాకుండా ఓవర్డోస్ అయింది. రెండో కారణం ఏంటంటే విజయ్ కు నత్తి పెట్టడం అది అంతగా సెట్ కాలేదు. ఇటీవల సినిమాల్లో హీరోలకు ఏదైనా లోపం ఉంటే స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది. అదే తరహాలో ఆలోచించిన పూరి, విజయ్ కు నత్తి పెట్టగా అది కాస్త బెడిసి కొట్టింది.
లైగర్ పరాజయానికి నాలుగో కారణంగా మ్యూజిక్ అని అనవచ్చు. ఒకటి రెండు పాటలు తప్ప మిగతావి అంతగా ఆకట్టుకోలేదు. అవి కూడా రిపీటెడ్ గా వినేంతగా లేవు. ఈ మూవీకి సునీల్ కశ్యప్, విక్రమ్ సహా పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేశారు. వారు అందించిన బీజీఎం అంతగా ఆకట్టుకోలేదు. ఇక చివరిగా చెప్పుకునే ఐదో కారణం సినిమాకు వచ్చిన హైప్. ఈ సినిమాకు ఊహించిన విధంగా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ పెరిగింది. మళ్లీ ఈ మూవీలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ నటించడం, ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ ను బోల్డ్ గా చూపించడంతో మరింత హైప్ క్రియేట్ అయింది. ఇవన్నీ లైగర్ ఫ్లాప్ అయ్యేందుకు కారణాలుగా మిగిలాయి.