ఫ్రెండ్ రాసిన ఉత్తరం ముక్కను పట్టుకొని…చదివిందే చదివి..చదివిందే చదవి తెగ మురిసిపోయిన రోజులు మనలో చాలా మందికి గుర్తే…అయితే కాలచక్రం జెట్ స్పీడ్ తో తిరిగిన క్రమంలో….స్మార్ట్ ఫోన్ల దెబ్బకు ఉత్తరం ముక్కల రెక్కలు విరిగాయి. ఈ మెయిల్స్ విప్లవం వచ్చాక… పెద్ద ఉత్తరాల పని కూడా అయిపోయింది. ఇదే కాలంలో కొరియర్ సర్వీసులు కూడా ఫాస్ట్ డెలివరీ అంటూ రయ్ న దూసుకొచ్చాయి……. వీటిని తట్టుకోడానికి మన పోస్టాఫీలు తీసుకొచ్చినవే స్పీడ్ పోస్ట్ అండ్ రిజిస్ట్రర్డ్ పోస్ట్…………… చాలా మంది పోస్టాఫీస్ కు వెళ్లి …పోస్టులు చేస్తారే కానీ ఈ రెండింటికి మద్య గల తేడాను పెద్దగా పట్టించుకోరు.
ఈ సందేహమే నాకు కూడా వచ్చింది. నాలాగా ఎవరైనా ఈ డౌట్ వచ్చి ఉండొచ్చు వారికి సమాధానం: వేగంగా సమాచారం చేరవేసేందుకు 1986లో స్పీడ్ పోస్ట్ ను ప్రవేశపెట్టింది భారతీయ తపాల శాఖ. స్పీడ్ పోస్ట్ ఇండియా అంతటికీ ఒకటే రేటు ఉంటుంది. త్వరగా ( 2-3 రోజుల్లో) డెలివరీ చేసేస్తారు. అన్నింటికంటే ముఖ్య విషయం ఏంటంటే….స్పీడ్ పోస్ట్ ఏ వ్యక్తికైతే వచ్చిందో…అతడు లేని పక్షంలో ఇంటి వాళ్లకు ఇవ్వొచ్చు.అలా ఇచ్చినప్పుడు వారి పేరును , ఫోన్ నెంబర్ ను నమోదు చేసుకుంటారు.
Registered Post: ఇది ఆర్డినరీ పోస్ట్ లాంటిదే , కానీ ఇందులో కొన్ని అదనపు సౌకర్యాలుంటాయి. ఇది కాస్త లేటుగా ( 2-5) రోజులలో డెలివరీ చేస్తారు. ఏ వ్యక్తి పేరు మీదైతే పోస్ట్ వస్తుందో …ఆ వ్యక్తికి మాత్రమే ఈ పోస్ట్ ను అందిస్తారు. ఇతరుల చేతికి ఇవ్వకూడదు. దీనిలో ఎప్పటికప్పుడు మన పోస్ట్ ఎక్కడ వరకు చేరిందనే విషయాన్ని కూడా ట్రాక్ చేయవచ్చు. స్పీడ్ పోస్ట్ తో పోల్చితే ఖర్చు కాస్త ఎక్కువ.