ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ పర్సులు వాడుతున్నారు. అయితే ఈ పర్సులు వాడేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది. అలా కాదని ఇష్టం వచ్చినట్లు… ఇష్టం ఉన్న వస్తువులు పర్సులో పెడితే ఆర్థిక సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. అయితే పర్సులో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. బిల్లు లేదా ఈఎంఐ పేపర్లు లాంటివి పొరపాటున కూడా జేబు, పర్సులో పెట్టకూడదు.
అలాగే ఫోన్ బిల్, ఇంటి బిల్లు లేదా ఇతర ఖర్చులకు సంబంధించిన బిల్లులను కూడా పర్సులో పెట్టకూడదు. మరికొంతమంది తమ పూర్వీకుల పై ఉన్న అమిత ఇష్టంతో వారి ఫోటోలను పర్సులో పెట్టుకుంటూ ఉంటారు. పూర్వీకుల ఆశీర్వాదం మనపై ఎప్పటికీ ఉండాలి. వారి ఆశీర్వాదం ఉంటేనే మనం ఆర్థికాభివృద్ధిని సాధించగలుగుతాం.
అయితే వారి ఫోటోలను పర్సులో పెట్టుకోవడం కాకుండా… ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవడం చాలా మంచిది. కొందరు దేవతల ఫోటోలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అయితే దేవతల ఫోటో పెట్టుకోవడం కంటే ఇంట్లో పెట్టుకొని పూజించడమే మంచిది. మరికొందరు తాళం చెవులను కూడా పెట్టుకుంటారు. ఇవి కూడా పర్సులో పెట్టుకోకూడదు. లోహపు వస్తువులను కూడా పర్సులో ఉంచుకోవడం మంచిది కాదు. అలాగే డబ్బులు కూడా ఎడాపెడా కుక్క డం కూడా మంచిది కాదు. వాటిని లెక్కించుకుని క్రమబద్ధీకరించుకుని పెట్టుకోవడం వల్ల బాగా ధనం కలిసి వస్తుంది.