ఎంతో విలువైన ఆస్తులు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సొంతం. ప్రపంచంలోనే గొప్పవిగా చెప్పుకునే వస్తువులు ఆయన దగ్గర కోకొల్లలు. అయితే, వాటన్నిటికన్నా ఓ 8 ఆస్తులు మాత్రం ముఖేష్ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేస్తాయి. ఒక్కోటి రూ. 100కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. అలాగే భారత దేశంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఒక్కరోజు సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్ళ పెడతారు.
ఆయన రోజుకు ఈజీగా రూ. 300 కోట్లు సంపాదిస్తున్నారట. ఏంటి షాక్ అయ్యారా, అవును రోజుకు 100 రూపాయలు సంపాదించాలంటే కష్టమవుతున్న ఈ రోజుల్లో ఈ అపరకుబేరుడు ఏకంగా రూ. 300 కోట్లు సంపాదిస్తున్నట్లు బార్ క్లేస్ హరూన్ ఇండియా రిచ్ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ఐతే ఈ మధ్య ముఖేష్ అంబానీ దుబాయ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విల్లా రూ.640 కోట్లు పెట్టి కొనడంతో మరోసారి ముఖేష్ అంబానీ సంపద మరియు అతని జీవనశైలి గురించి సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఈ దుబాయ్ విల్లా మాత్రమే కాదు ముఖేష్ అంబానీ కూడా 9 విలాసవంతమైన వస్తువులను కలిగి ఉన్నాడు.
యాంటిలియా – ముంబైలో రూ. 15,000 కోట్ల విలువైన రెసిడెన్షియల్ టవర్లు ఉన్నాయి. మాండరిన్ ఓరియంటల్ హోటల్ USA – రూ. 780 కోట్లు ఉంటుంది. దుబాయ్‌లో రూ. 640 కోట్ల విలువైన ముఖేష్ అంబానీ విలాసవంతమైన ఇల్లు ఉంది. స్టోక్ పార్క్ ఎస్టేట్స్ – యునైటెడ్ కింగ్‌డమ్ విలువ రూ. 600 కోట్లు ఉంటుంది. ఎయిర్‌బస్ A319 ప్రైవేట్ విమానం – విలువ రూ. 250+ కోట్లు ఉంటుంది. బోయింగ్ బిజినెస్ ఫ్లైట్ విలువ రూ. 535+ కోట్లు పైగా ఉంటుంది. ఫాల్కన్ 900 ప్రైవేట్ జెట్ విలువ రూ. 33 కోట్లకు పైగా ఉంటుంది. జపాన్ యొక్క పురాతన టీ కప్ సెట్ విలువ రూ. 1.5 కోట్లుగా ఉంది. ముంబై ఇండియన్స్ విలువ రూ.1000 కోట్లకు పైగా ఉంటుంది.