స్థూలకాయం నేడు ఎంతో మంది ఎదుర్కొంటున్న సమస్య..కొంచెం బరువు పెరగ్గానే నాజూగ్గా తయారవ్వాలని తాపత్రయపడుతుంటాం . అసలు బరువు పెరగడానికి రీజన్ మన అలవాట్లు,ఆహరపు అలవాట్లు ,జీవన ప్రమాణాలు, కాలుష్యం తదితర కారణాలు.బరువు పెరగ్గానే నానా హైరానా పడిపోయి పార్కుల్లో గంటలు గంటలు వాకింగ్ లు,జిమ్లో కుస్తీపాట్లు కానీ బరువు తగ్గిన దాఖలాలు మాత్రం అంతంత మాత్రమే..ముందుగా మన శరీరానికి ఎన్ని కెలోరీలు అవసరం,మనం ఎన్ని కెలరీల ఆహారం తీసుకుంటున్నాం,ఏ ఆహారం తీసుకుంటే ఎన్ని కెలోరీలు మన శరీరానికి అందుతాయి,ఏ పనికి ఎన్ని కేలొరీలు ఖర్చు అవుతాయి.ఈ అంశాల పట్ల అవగాహన ఉంటే మనం ఆరోగ్యంగా ఉండడమే కాదు,సరైన బరువులో ఉండడం కూడా సాధ్యమే…
ఒక వ్యక్తి ఎన్ని కేలరీలు తీసుకోవాలన్నది ఆ వ్యక్తి వయసు,ఎత్తు,అతడు చేసే పని బట్టీ ఉంటుంది.పురుషులైతే 2500కెలోరీలు,స్త్రీలు 2000 కెలోరీలు ఆహారం తీసుకోవాలి.ఏ ఏ పదార్దాల్లో ఎన్ని కెలోరిలుంటాయో తెలుసా.. కప్పు అన్నం 120కెలోరిలు,కూర ,పప్పు ,సాంబారుల్లో చెరో 150 కెలోరిలు ,అప్పడం పచ్చడిలలో 45,30 కెలోరీలు ఉంటాయి.మనం రోజు తాగే టీ కాఫీలో 40 కెలోరీలు,పాలు కలపకపోతే 10..ఈవెనింగ్ తీసుకునే స్నాక్స్ లో సమోసా 100,పానీపూరీ 150,నూడుల్స్ ,ఫ్రైడ్ రైస్ ల్లో 450 కెలోరీలు,శాండ్ విచ్ ,చికెన్ ఫ్రైలో 250 ..మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ 100,దోశ 120,మసాలా దోశ 250 కెలోరీలు ఉంటాయి..
దీన్ని బట్టి మీరు రోజుకి ఎన్ని కెలోరిల ఆహరం తీసుకుంటున్నారో తెలుసుకోండి. పండ్లు తినడం అందరికీ ఇష్టమే కానీ మనం తీసుకునే పండ్ల ద్వారా ఎన్ని కెలోరిలు మన శరీరానికి అందుతాయో మనకు తెలీదు..వంద గ్రాముల అరటి పండు 89,ఆపిల్ 52,సపోటా 83 దానిమ్మ 83 కెలోరీలు ఇస్తాయి.వంద గ్రాముల పనస ద్వారా మన శరీరానికి అందే కెలోరీలు95. మనం చేసే వ్యాయామం వలన ఎన్ని కెలోరిల శక్తి ఖర్చవుతుందో కూడా తెలుసుకోవాలి కదా… సైక్లింగ్ 450,ఈత 550,రన్నింగ్ 550 ,నడక 250,యోగా ఇతర వ్యాయామల వలన గంటకు 300 కెలోరిలు ఖర్చవుతాయి..గంట పాటు ఇంటిపని,తోటపని చేస్తే ఖర్చయ్యే కెలోరీలు చెరో 300… దీన్ని బట్టి మీరు రోజుకి ఎన్ని కెలోరిల ఆహారం తీసుకుంటున్నారు,ఎన్ని కెలోరిలు ఖర్చు పెడ్తున్నారో తెలుసుకోండి…