క్షణక్షణం సినిమా థియేటర్ లో చుసిన గుర్తు నాకు ఇంకా ఉంది … ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు వెంకటేష్ బాగా పీక్ లో కి వెళ్ళిపోయాడు .. బొబ్బిలి రాజా లాంటి మాస్ సినిమా చేసిన వెంకటేష్ .. మాస్ జనాలకు తెగ నచ్చేసాడు … శత్రువు కొంత క్లాస్ గా ఉన్న కూడా స్క్రీన్ప్లే ఆసక్తికరంగా ఉండింది .. కూలీ నం. 1 మళ్ళీ జనాల్లో ఒక ఊపు తీసుకొచ్చింది .. సూర్య IPS తో కూడా హిట్ కొట్టి .. మంచి ఊపు మీద ఉన్న వెంకటేష్ కి RGV తో సినిమా అంటే సినిమా మీద ఆశలు తారాస్థాయికి చేరాయి .. అప్పుడే శివ తీసి ఇండస్ట్రీ ని షేక్ చేసిన RGV .. వెంకటేష్ లాంటి మాస్ హీరోతో కలిస్తే అది ఒక ప్రభంజనం అవుతుందని జనాల నమ్మకం ఆ రోజుల్లో .. జనాల ఎక్సపెక్టషన్స్ సెట్ చేయడంలో RGV ఒకరకంగా ఫెయిల్ అయ్యాడు ..
ఇప్పుడు చూస్తే మనకు సినిమా బాగుంది అనిపిస్తుంది కానీ .. మీరు జాగ్రత్తగా గమనిస్తే బాక్గ్రౌండ్ స్కోర్ కూడా అందులో ఎక్కువగా ఉండదు .. చాలా సాధారణంగా ఉంటుంది ఏదో నిజ జీవితంలో జరుగుతున్నట్టు, అది అప్పట్లో వచ్చే సినిమాలకు మ్యాచ్ అవ్వలేదు .. సినిమా అంత డల్ గా సాగుతున్నట్టు ఉండేసరికి జనాలకు నీరసం వచ్చింది .. మధ్య మధ్యలో కామెడీ పండటం వలన .. పియానో వాయిస్తున్న విలన్ సీన్ లాంటి వాటిల్లో జనాలు కొంత నవ్వుతు కనిపించారు .. ముఖ్యంగా సినిమాలో మాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వలన అది జనాలకు పెద్దగా ఎక్కలేదు .. అదే కాదు .. ఆ తరవాత వచ్చిన అంతం కూడా ప్లాప్ అయింది .. నాగార్జున చివర్లో చచ్చిపోవడాన్ని జనాలు జీర్ణించుకోలేకపోయారు ..
రాత్రి కూడా థియేటర్ లో చూసాను .. నేను చూస్తున్న టైం లో ఒకరో ఇద్దరో ఉన్నారు బాల్కనీ లో ..ముఖ్యంగా రేవతి థియేటర్ సీన్ , నీళ్ల ఒడ్డున కూర్చున్న సీన్ … క్లైమాక్స్ సీన్ మటుకు ఒళ్ళు జల్లరించింది … సినిమా చాలా బాగుంది అని నా స్నేహితులతో అంటే నవ్వారు .. అదేం బాగుంది రా అని .. కానీ ఈ సినిమాలు ఇప్పుడు చూసినా కూడా కొత్తగా అనిపిస్తుంది .. జనాలు స్వీకరించేదాని కంటే కూడా ముందే ఇలాంటివి అన్ని RGV తీసాడు .. 2003 లో హిందీ లో రాత్రి సినిమాని అటు ఇటుగా మర్చి భూత్ అని తీస్తే హిట్ అయింది .. అంటే RGV ఆలోచనలకూ జనాలు తూగడానికి వారికి 10 ఏళ్ళ సమయం పట్టింది .. అట్లాగే క్షణక్షణం కూడా అదే కోవకి చెందినది … రిలీజ్ అయినప్పుడు జనాలు అది చూడడానికి సిద్ధంగా లేరు .. కొంత ఎక్సపెకేషన్స్ తగ్గాక సెకండ్ రిలీజ్ చేస్తే ఆ సినిమా బాగా ఆడింది ..