దానిమ్మకాయ గింజలను చూస్తే నోరూరిపోతుంది. ఈ ఎర్రని దానిమ్మ గింజలు ముత్యాల లాగా భలేగా ఉంటాయి. చూడగానే ఎర్రని కెంపులను తలపించే ఈ దానిమ్మ పండు గింజలను అందరూ ఇష్టంగా తింటారు. దానిమ్మ గింజలను జ్యూసులలోనూ, వివిధ ఆహార పదార్థాలలోనూ వినియోగిస్తుంటారు. దానిమ్మకాయ వలన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దానిమ్మ గింజలు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దానిమ్మ పండు తినడం వలన రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. జ్వరం వచ్చిన వారికి పెడతారు. దీన్ని తింటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి. వ్యాధితో పోరాడే శక్తి వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గితే, వాటిని మళ్లీ తిరిగి పెంచడానికి దానిమ్మ గింజలు ఎంతో ఉపయోగపడతాయి. దానిమ్మ పండులో విటమిన్ సి, విటమిన్ కె, మెగ్నీషియం, బాస్వరం, పొటాషియం,ఫైబర్, ప్రోటీన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి.
అంతేకాదు ఇందులో ఉండే పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతాయి. దానిమ్మ గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు కూడా బలంగా మారుతాయి. దానిమ్మ గింజలని క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే కణ విభజనకు, రక్త పోటును నియంత్రించుటకు సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. చర్మంలో కాంతిని నింపుతుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఎంతో తోడ్పడుతుంది. దీనివల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడగలుగుతుంది. ఇది పండు మాత్రమే కాదు, దీని తొక్క, విత్తనాలు, పువ్వుల్లో కూడా పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ రకపు అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం దానిమ్మ పండును అస్సలు తినకూడదు. దీనికి దూరంగా ఉండాలి.
చర్మ సమస్యలు ఉన్నవారు దానిమ్మ పండ్లను తినకూడదు. ఈ పండును తింటే సమస్య మరింత తీవ్రవం అయ్యే అవకాశం ఉంది. దానిమ్మ పండ్లు తింటే చర్మంపై మచ్చలు, అలర్జీస్ వంటి సమస్యలు పెరుగుతాయి. కావున వీటిని అతిగా తినకపోవడం మంచిది. లిమిట్ గా తినాలి. తక్కువ రక్తపోటు అంటే లోబీపీ ఉన్నవారు దానిమ్మ పండ్లను తినకూడదు. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ ఇంకా మందగిస్తుంది. లో షుగర్ సమస్య ఉన్నవారు కూడా ఈ పండ్లను తినకూడదు. రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడుతున్న వారు ఈ పండ్లకు దూరంగా ఉండాలి. జీర్ణ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సూచన మేరకుఈ పండ్లను తినవచ్చు.