ఒకప్పుడంటే స్మార్ట్‌ఫోన్లు, జీపీఎస్ పరికరాలు లేవు కనుక మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే అడ్రస్ కనుక్కునేందుకు అందరినీ అడగుతూ వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడలా కాదుగా. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. దానికి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో ఉంది. ఇంకేముంది.. మనం ఎక్కడికి వెళ్లాలనుకున్నా గూగుల్ మ్యాప్స్‌లో జీపీఎస్ ఆన్ చేసి నావిగేషన్ పెట్టుకుని వెళితే చాలు.. అదే మనకు దారి చూపుతుంది. దీంతో మనం వెళ్లాలనుకున్న గమ్యస్థానానికి సులభంగా వెళ్లవచ్చు. దీంతోపాటు మనం ఏ ప్రదేశంలో ఉన్నా ప్రపంచంలోని ఏ ప్రదేశాన్నయినా గూగుల్ మ్యాప్స్‌లో వెతకవచ్చు. దాని గురించిన వివరాలను పొందవచ్చు. అయితే భూమిపై ఉన్న ఏ ప్రదేశాన్ని వెతికినా గూగుల్ మ్యాప్స్‌లో కనిపిస్తుంది. కానీ కొన్ని ప్రాంతాలు, భవనాలు, నిర్మాణాలు మాత్రం గూగుల్ మ్యాప్స్ లో ఎంత వెతికినా మనకు కనిపించవు. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకీ అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
1. ది రాయల్ రెసిడెన్సీ: నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టర్ డ్యామ్‌లో ది రాయల్ రెసిడెన్సీ భవనం ఉంది. దీన్ని కొనికిక్జ్ ప్యాలిస్ అమ్‌స్టర్ డ్యామ్ అని కూడా అంటారు. అయితే ఈ రాయల్ ప్యాలెస్‌ను గూగుల్ మ్యాప్స్‌లో వెతికితే మీకు దాని ఇమేజ్ ఎప్పుడూ మసగ్గానే కనిపిస్తుంది. దీని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. 2. బఫెలో నయగారా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ : ఈ ఎయిర్ పోర్టును గనక మీరు గూగుల్‌లో వెతికితే మ్యాప్స్‌లో అది ఎప్పుడూ తెల్లగానే కనిపిస్తుంది. కావాలంటే మీరు ట్రై చేసి చూడవచ్చు. ఎంత జూమ్ చేసినా ఎయిర్‌పోర్టు మాత్రం అలాగే కనిపిస్తుంది. 3. టాన్ టుకో నేషనల్ పార్క్: ఈ పార్క్ చిలీ దేశంలో ఉంది. దీన్ని మీరు గూగుల్ మ్యాప్స్‌లో వెతికితే అది కేవలం ఒక మార్క్‌ను మాత్రమే చూపిస్తుంది తప్ప పార్క్ పెద్దగా కనిపించదు. అయితే ఈ పార్క్ ఒక రిజర్వ్ ఫారెస్ట్. ఇందులో అనేక వన్య ప్రాణులుంటాయి. కానీ చాలా వరకు జంతువులు ప్రస్తుతం అంతరించిపోతున్నాయి.
4. కివోయి డ్యాం, సౌత్ కార్లోనియా: గూగుల్ మ్యాప్స్‌లో మీరు ఈ డ్యాం గురించి వెతికితే మసగ్గా కనిపిస్తుంది. అయితే దీని ఆకారం మాత్రం చూసేందుకు క్రిస్ మస్ చెట్టులా ఉంటుంది. ఈ డ్యాం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. డ్యూక్ ఎనర్జీ అనే కంపెనీ ఈ డ్యాంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంటుంది. 5. మిస్టోరియన్ రష్యన్ సైట్: దీన్ని కూడా మీరు గూగుల్ మ్యాప్స్‌లో వెతికితే మసకగానే కనిపిస్తుంది. ఇది ఒక ముఖ్యమైన సైబేరియన్ టండ్రా. రష్యాలోని ఈజివిక్నోట్‌కు దగ్గరగా అలస్కా దారిలో బేరింగ్ జలసంధి దగ్గర ఈ ప్రాంతం ఉంటుంది. 6. మినామి తిరోషియా ఎయిర్ పోర్టు, జపాన్: జపాన్‌లో ఈస్ట్ కోస్ట్ దగ్గర ఉన్న ఈ ఎయిర్ పోర్టు వన్ రన్ వే ఎయిర్ పోర్టు. ఇది కూడా గూగుల్ మ్యాప్స్‌లో మనకు తెల్లగానే కనిపిస్తుంది. ఈ ఎయిర్ పోర్టును జపాన్ కు చెందిన సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఉపయోగిస్తోంది.
7. ది మైకేల్ ఆఫ్ బిల్డింగ్, ఉతా: ఉతాలో ఉన్న ఈ బిల్డింగ్‌ను గూగుల్ మ్యాప్స్‌లో చూస్తే తెల్లగా కనిపిస్తుంది. దీన్ని అమెరికా ఆర్మీ వాడుతుంది. ఇందులో బయాలజికల్ కెమికల్ వెపన్స్ తయారు చేస్తారు. ఇది ఎప్పుడూ గూగుల్ మ్యాప్స్‌లో ఇలాగే కనిపిస్తుంది. 8. కార్నెల్ యూనివర్సిటీ కంబైన్డ్ హీట్ అండ్ పవర్ ప్లాంట్, న్యూయార్క్: 2010లో దీన్ని ఓపెన్ చేశారు. అయితే ఈ పవర్ ప్లాంట్ కూడా గూగుల్ మ్యాప్స్‌లో మనకు తెల్లగానే కనిపిస్తుంది. ఇందులో నాచురల్ గ్యాస్‌తోపాటు ఎలక్ట్రిసిటీ విభాగం కూడా ఉంది. కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు తగ్గుతున్నాయని దాని డెవలప్‌కు దీన్ని రెడీ చేశారు. 9. బాబిలోన్, ఇరాక్: ఇరాక్‌లో ఉన్న భూభాగం ఇది. గూగుల్ మ్యాప్స్‌లో స్పష్టంగా కనిపించదు. ఇలాంటివి అక్కడ ఇంకా చాలా ఉన్నాయి. 10. విల్సిన్ జెన్ ది నెదర్లాండ్స్: డచ్ రాయల్ ఫ్యామిలీకి చెందిన భవంతి ఇది. అయితే ఇది గూగుల్ మ్యాప్స్‌లో ఎప్పుడూ మసగ్గా కనిపిస్తుంది. ఈ భవంతిలో ఆర్మీ ట్యాంకులు, ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు ఉంటాయట.