ఈనాడు అక్రమ సంబంధాలు అనేవి సమాజంలో పెద్ద సమస్యగా మారాయి . దీనికి అనేక కారణాలు ఉండవచ్చు .మారుతున్న నైతిక విలువలు,ఆర్థిక సంబంధాలు కూడా కారణం.కొన్నీ కారణాలని ఇక్కడ తెలుసుకుందాం. కొంతమంది భర్తలు భార్యలని ఇంటి పని వంట పని చేసే యంత్రాలుగా చూస్తున్నారు. సంసార జీవితం చాలా రొటీన్ గా అవుతోంది. దీనివల్ల స్త్రీలకు ఒక రకమైన ఫ్రస్టేషన్ వస్తుంది .ఇది అన్యపురుషుల పట్ల ఆకర్షణకు కారణమవుతుంది . కొంతమంది స్త్రీలకు శృంగార జీవితం చాలా అతృప్తిగా గడుస్తుంది. శృంగారంలో భర్త ఆసక్తి చూపకపోవడంతో అన్యపురుషుల వంక ఆకర్షింపబడతారు . కొంతమంది స్త్రీలకు భర్త ఆదరణ ఉండదు. ఏమాత్రం ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు. నువ్వు భోంచేసావా , ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగే దిక్కు కూడా ఉండదు. అటువంటప్పుడు స్త్రీలు ఫ్రస్ట్రేషన్ కు గురి అవుతారు.
ఇటువంటి సందర్భాల్లో అన్యపురుషులు కొద్దిగా ఆదరణ చూపినా వారి వంక ఆకర్షితులవుతారు. ఇది ఒక రకంగా మానసిక బలహీనత అని చెప్పొచ్చు. ఈనాడు స్త్రీ పురుషులు కలసి ఎన్నో రంగాల్లో పనిచేస్తున్నారు అటువంటి అప్పుడు కొన్నిసార్లు ఒకరి వైపు మరొకరు ఆకర్షితులవుతారు. వివాహమైన వారు కూడా దీని నుంచి తప్పించుకోలేరు. అలాగే నైట్ డ్యూటీలో కలసి పని చేస్తే స్త్రీ పురుషులు ఒకరికొకరు ఆకర్షితులయ్యే అవకాశాలు ఉన్నాయి . ఇది కూడా అక్రమ సంబంధాలకు దారితీస్తుంది. అలాగే కొన్ని రంగాలలో ఇది ఆబ్లిగేషన్. ఉదాహరణకు గ్లామర్ తో ముడిపడి ఉండే రంగాలు ;సినిమా ,టీవీ సీరియల్స్ ,మోడలింగ్ ఇటువంటి వాటిలో అవకాశం కోసం కొందరు స్త్రీలు మగవారికి లొంగిపోతారు.
ఉద్యోగాలలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇటువంటి వాటికి కూడా కొందరు పురుషులు స్త్రీలను లొంగ తీసుకుంటారు. మహిళలకు మద్దతుగా ఎన్ని చట్టాలు ఉన్నా కూడా ఇది ఎన్నో రంగాల్లో కొనసాగుతోంది. చివరగా ఒక అంశం మనం తెలుసుకోవాలి .ఏమంటే అక్రమ సంబంధాలు ఎప్పటికీ సంసారాన్ని సమాజాన్ని నాశనం చేస్తాయి. మన సంస్కృతికి ఇవి సరిపడవు. పాశ్చాత్య సంస్కృతి వేరే, మన సంస్కృతి వేరే.