యూరోప్ లో అలాంటి నగరాలు గురించి మీకు కొంచం తెలిసి ఉండవచ్చు. కాని మన దేశానికి సంబంధించిన అలాంటి నగరం ఒకటి వుందని తెలుసా? నేపాల్ కు వెళ్ళడానికి అనేక మార్గాలున్నాయి. మేం గోరఖ్ పూర్ వెళ్లి అక్కడినుంచి సొనాలి మీదుగా నేపాల్ లో ప్రవేశించాము.
సొనాలి చిన్న టౌన్, సగం నేపాల్ లో, సగం మనదేశంలో ఉంది ఆ టౌన్. అక్కడ చెక్ పోస్టు, అక్కడే గోరఖ్ పూరునుండి మేం వచ్చిన టేక్సీదిగి రిక్షాలో మాలగేజి పెట్టుకొని చెక్ పోస్టు దాటాము. రిక్షా వాళ్ళు స్వేచ్ఛగా అంటూ ఇటూ తిరుగుతూనే ఉంటారు. . అటూఇటూ రెండు దేశాల పోలీసులు ఉంటారు. మేం లెక్చరర్లని చెప్పగానే మన పోలీసులు విడిచిపెట్టారు ఏమీ చెక్ చేయకుండానే. నేపాలి పోలీసులు అసలు ఏమీ అడగలేదు.
చెక్ పోస్టు దాటగానే నేపాల్ భాగంలోని సొనాలి టౌన్. చెక్ పోస్టుకు సమీపంలోనే లాడ్జిలో దిగాము. మనవైపు సొనాలిలో లాగా బార్లు, గేంబ్లింగ్ గృహాలు లేవు గాని ఆవైపు చాలా నైట్ లైఫ్. గోరఖ్ పూర్, స్ధానికులు, నేపాల్ లోని సొనాలిలో నైట్ క్లబ్బులకు వచ్చి ఆడతారు! మేము కాసేపు ఆ సందడి చూచి మా హోటల్ కు వెళ్ళిపోయాము. నేపాల్ యాత్ర పూర్తయిన తర్వాత మళ్ళీ నేపాల్ లోని సొనాలిలోనే రాత్రి విశ్రమించి ఉదయం టాక్సీలో గోరఖ్ పూరువెళ్ళాము. సరదా అయిన అనుభవం!