మేడిపండు అంటే మేడి చెట్టు కాయ. దీని హైబ్రిడ్ రకాలను అత్తిపండు, అంజీర అంటారు. మన దేశంలో చాలా చోట్ల ఈ చెట్లు కనిపిస్తాయి. మేడిపండు చూడడానికి గుండ్రంగా ఉంటుంది. పచ్చగా ఉన్నప్పుడు కాస్త పుల్లగా, చేదుగా ఉంటుంది. పండి పసుపు రంగులోకి మారిన తరువాత తీపిగా ఉంటుంది. నాటు పండయిన మేడిపండ్లలో పురుగులు ఉంటాయి. ఇది పూర్తిగా organic. అత్తిపండ్లు పెంచబడిన మొక్కల నుంచి వస్తాయి. వీటి పెంపకంలో పురుగుమందుల స్ట్రే కారణంగా పురుగులుండవు. ముఖ్యంగా మేడి పండు పండడం మొదలైనప్పుడు, మేడిపండులోని చిన్న చిన్న గుబ్బల వంటి కండ కోసం పురుగులు పండులోకి చేరి పండుని తింటాయి.
పురుగులకు తీపి రుచి ఎక్కువగా ఇష్టం. పండు మృదువుగా ఉండటం వల్ల పురుగులు పండుని తేలికగా తినడానికి ఇది కారణం. మేడిపండు తినే ముందు బాగా పరిశీలించి పురుగులు లేకుండా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఉంటే పురుగులు తీసేసి తినవచ్చు. పురుగులతోపాటు ఇతర మురికి తొలగించడానికి పండుని బాగా కడిగి తినాలి. పాడైన పండ్లు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి కాబట్టి వాటిని తినకూడదు.
మేడిపండులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత ఉన్నవారికి చాలా మంచిది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మేడిపండులో పురుగులు ఉండడం సర్వసాధారణం. అయితే కొన్ని రకాల పురుగులే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అనేక పోషక విలువలు గల ఈ మేడిపండు తినేటప్పుడు జాగ్రత్తగా పురుగులు తీసి తినండి. తినడం మానకండి.