బంగాళా దుంప అందరూ ఇష్టపడే కూర అయితే – ఎవరూ ఇష్టపడని కూర కాకరకాయ. అయితే, ఏ రుచీ పచీ లేని చేదైన ఈ కూర షుగర్ వ్యాధికి మందుగా పనిచేస్తుంది. డయాబెటీస్ నివారణలో కాకరకాయతో నివారించటమనేది గొప్ప పరిశోధనా ఫలితం. కాకరకాయ డయాబెటీస్ నియంత్రణకు ఏవిధంగా పని చేస్తుందో చూద్దాం! కాకర కాయలో చరాంతిన్ అనే సహజమైన స్టెరాయిడ్ వుంటుంది. ఈ స్టెరాయిడ్ రక్తంలో షుగర్ స్ధాయిని తగ్గిస్తుంది.
ఇందులో వుండే ఓలీనాలిక్ యాసిడ్ గ్లూకోసైడ్స్ బ్లడ్ లో షుగర్ టాలరెన్స్ ను పెంచుతాయి. ఆ విధంగా బ్లడ్ షుగర్ స్ధాయిలను సరిగా వుంచి పాన్ క్రియాస్ ఇన్సులిన్ ను అధికంగా తీసుకోకుండా చేస్తాయి. రక్తంలో వున్న అధిక షుగర్ ను ఒక చోటకు చేర్చి బ్లడ్ లో స్ధాయి పెరగకుండా దానిని విచ్ఛిన్నం చేస్తుంది.
రక్తంలో అధిక షుగర్ స్ధాయిని తగ్గించే కాకరకాయ శరీరంలో కొవ్వుకూడా అధికం కాకుండా తోడ్పడుతుంది. డయాబెటీస్ రోగ నియంత్రణకు ఒక వెజిటబుల్ గానే కాక, కాకరకాయలో జింక్, విటమిన్ బి కాంప్లెక్స్, కరగని ఫ్యాటీ యాసిడ్ మొదలైన పోషకాలు కూడా వుంటాయి. దీని ప్రధాన లాభాలలో ఒకటి రక్తాన్ని శుభ్రం చేస్తుంది. లివర్ ను కిడ్నీలను కూడా ఆరోగ్యంగా వుంచుతుంది.