వంట చేయడం రానివాళ్లు కూడా ఈజీగా చేసే పని ఏదన్నా ఉందా అంటే పెరుగు తోడు పెట్టడం… వేడి అన్నం వండుకుని ,పెరుగు తోడు పెట్టుకుని, ఆవకాయ నంజుకు తింటే ఆ టేస్టే వేరు… కానీ పెరుగు తోడు పెట్టడం ఎంత ఈజీనో… కానీ కొన్ని సార్లు పెరుగు సరిగా తోడుకోదు… లేదంటే పులిసిపోయినట్టు గా ఉంటుంది….. ఈ కాలంలో పెరుగు సరిగా తోడుకోదు, దానికోసం చిన్న చిట్కా పాటిస్తే చాలు.. అదేంటంటే..
ఈ కాలంలో పెరుగు తోడు పెట్టడానికి గోరు వెచ్చటి పాలలోనే తోడు వేయాలి… అలాకాకుండా చల్లటి పాలలో తోడు పెడితే అది పాలలానే ఉంటుంది… అలాంటప్పుడు తోడుపెట్టినా తోడుకోకుండా ఉన్న పాలగిన్నెని, ఒక ప్లేట్లో గోరువెచ్చటి నీరు తీసుకుని అందులో పెట్టాలి. తీయటి పెరుగు చిటికెలో తోడుకుంటుంది. ట్రై చేసి చూడండి.
మిగిలిపోయిన పెరుగు మొత్తంలో పాలు పోసేస్తుంటారు చాలామంది… అలా చేయడం వల్ల పెరుగు పుల్లగా తోడుకుంటుంది. అలాకాకుండా స్పూన్ తో కొంచెం పెరుగు తీసుకుని, పాలల్లో కలిపేస్తే తీయటి పెరుగు తోడుకుంటుంది…