మొట్టమొదట ఈ డబుల్ డెక్కర్ బస్సులని నిజాం రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ వారు హైదరాబాదులో ప్రారంభించారు. ఈ బస్సులు ప్రారంభించడానికి ఆరవ నిజాం భార్య జహూరున్నీసా తన మెహర్(పెళ్ళిచేసుకున్నప్పుడు భర్త నుండి పొందిన డబ్బు) ఉపయోగించడం వల్ల ఆమె గౌరవార్ధం ఒకప్పుడు హైదరాబాదులో ఉపయోగించిన డబుల్‌డెక్కర్ బస్సుల నంబర్ల చివర ఆమె పేరులోని మొదటి ఆంగ్ల అక్షరం Z ఉంచారు.
ఒకప్పుడు నడిచిన డబుల్‌డెక్కర్ బస్ సర్వీసులు .సికిందరాబాదు నుండి బహదూర్‌పురాలో ఉన్న జంతుప్రదర్శనశాల మధ్య నడిచిన 7Z, చార్మినార్ సికిందరాబాద్ మధ్య నడిచిన 2Z, సికిందరాబాద్ మెహదీపట్నం మధ్య నడిచిన 5Z ఉండేవి.
ఈ బస్సు సర్వీసులని రద్దు చేయడానికి ప్రధాన కారణాలు- హైదరాబాదులో పెరిగిన ఫ్లైఓవర్లు, భారమైన నిర్వాహణ, మరమ్మత్తుల ఖర్చులు, విడిభాగాలు లభ్యమవ్వకపోవడం. ఈ కారణాల వల్ల డబుల్ డెక్కర్ బస్సులను నడపడం లేదు. కానీ చాలా వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో డబుల్ డెక్కర్ బస్సులను నడిపిస్తున్నారు.