రకా రకాల ఆకర్షణీయమైన ప్యాక్‌లలో.. రక రకాల ఫ్లేవర్లు కలిగిన ఆలుగడ్డ చిప్స్ తినడం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. అలాంటి వాటిని ఎవరైనా ఆసక్తిగానే తింటారు. పిల్లలే కాదు, పెద్దలకు కూడా ఆ చిప్స్ అంటే ఇష్టమే ఉంటుంది. అయితే ఈ చిప్స్ గురించిన ఒక విషయాన్నే ఇప్పుడు చెప్పబోతున్నాం. అదేమిటంటే… సాధారణంగా ఏ తరహా ఫ్లేవర్ కు చెందిన లేదా ఏ కంపెనీ తయారు చేసే ఆలుగడ్డ చిప్స్ అయినా అవి తయారు చేస్తున్నప్పుడు లేదా తయారు చేశాక ప్యాకింగ్ సమయంలో, అనంతరం వాటిని రవాణా చేస్తున్నప్పుడు అసలే పగలవు. కరెక్టే కదా. గమనించారు కదా. అవి అసలు పగలవు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..? కొంపదీసి వాటిల్లో అలా పగలకుండా ఉండేందుకు గాను ఏవైనా కెమికల్స్ కలుపుతారా ఏంటీ.. అంటే కాదు.. కెమికల్స్ ఏమీ కలపరు. అయినప్పటికీ అవి పగలవు. మరి అది ఎలా సాధ్యమంటే..
చిప్స్ గురించి చెప్పేముందు మీరు ఒక కోడిగుడ్డును తీసుకుని ప్రయోగం చేయండి. ఒక గుడ్డును నిలువుగా పెట్టి దాన్ని అలాగే ఉంచి చేత్తో పట్టుకోండి. అనంతరం దాన్ని పగలగొట్టండి. అది పగలదు గాక పగలదు. కానీ అదే గుడ్డును అడ్డంగా పెట్టి దాన్ని చేత్తో పట్టుకుని పగలగొడితే సులభంగా పగులుతుంది. గమనించారు కదా. అయితే దాదాపుగా ఇదే సూత్రం పైన చెప్పిన ఆ చిప్స్‌కు కూడా వర్తిస్తుంది. అది ఎలా అంటే…
ఆలు చిప్స్‌లను తయారు చేసే కంపెనీలు ఓ మ్యాథమాటికల్ ఫార్మూలాను ఫాలో అవుతాయి. అందులో పారాబోలా (చాపం) ఆకృతిలో ఉంటే ఏ పదార్థానికైనా దృఢత్వం లభిస్తుంది. అందుకనే ఆలు చిప్స్‌ను తయారు చేసే కంపెనీలు చిప్స్‌ను ఈ పారాబోలా ఆకారంలో తయారు చేస్తాయి. దీంతో అవి పగిలిపోయేందుకు, విరిగిపోయేందుకు అవకాశం ఉండదు. ఇదీ.. చిప్స్‌ను అలా తయారు చేయడం వెనుక ఉన్న అసలు రీజన్. అందుకనే అవి తయారీ సమయంలో, ప్యాకింగ్ అప్పుడు, ట్రాన్స్‌పోర్ట్ సమయంలోనూ అస్సలు పగిలిపోవు..!