దీనికి సరైన సమాధానం చెప్పడం కాస్త కష్టం. కానీ ప్రయత్నిస్తాను. ముఖ్యంగా మీ ప్రశ్న లో కొన్ని వివరాలు లేవు. 20000 రూపాయలు సంపాదించే మీరు రూ:30 లక్షల రూపాయలు అప్పు ఎలా చేసారు అనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న. మీకు అప్పు ఇచ్చిన వారు అన్ని లక్షలు ఇచ్చారంటే మీరు తప్పక తీర్చగలరు అనే నమ్మకం ఉంటేనే ఇస్తారు. అలాంటప్పుడు వాళ్ళకు మీ మీద ఉన్న నమ్మకం మీపై మీకు లేకపోతే ఎలా? ఆలోచించండి. వాళ్ళు మీ మీద అంత నమ్మకం పెట్టారు అంటే మీకు తీర్చగలిగే వనరులు ఉన్నాయి అని వాళ్ళు నమ్మారు. ఆ వనరులు ఏమిటో ఆలోచించండి. ఇక ఆ అప్పులు పిల్లల ఉన్నత చదువుల కోసం చేసి ఉంటే మీ పిల్లల చదువు పూర్తి అయి ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళని తీర్చమనండి. అది వాళ్ళ బాధ్యత. మన పిల్లలు మన ఆస్ధులకు మాత్రమే కాదు, వారి భవిష్యత్తు కోసం మనం చేసే అప్పులకు కూడా బాధ్యత వహించాలి. ఇలా అంటున్నందుకు ఏమి అనుకోవద్దు.
అదే ఆ అప్పులు మీ వ్యసనాలకు చేసి ఉంటే వాళ్ళకి బాధ్యత లేదు. ఎలా అయినా మీరే తీర్చుకోవాలి. ఇంకొక విషయం. మీరు అప్పులు రూ:30 లక్షలు అన్నారు కానీ అవి secured loans or unsecured loans అన్నది చెప్పలేదు. అలాగే ఆ అప్పులు బ్యాంకు ల నుండి తీసుకున్నారా లేదా మీకు తెలిసిన వారి దగ్గర తీసుకున్నారా అన్నది చెప్పలేదు. మీకు సొంత ఇల్లు గానీ స్థలం కానీ ఉన్నట్లయితే మీరు వాటిని అమ్మి ముందు అప్పులు తీర్చేయండి. అప్పుడు మీకు గౌరవం లభిస్తుంది. తర్వాత మీ ఆదాయం బట్టి ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని కొద్దిగా పొదుపుగా జీవించండి. నెమ్మదిగా అన్నీ సర్దుకున్నాక మళ్ళీ ఇల్లు కొనుక్కోవచ్చు.
ఇక ఆఖరుగా ఒక్క మాట, మీకు ఏ విధమైన ఆదాయ మార్గాలు లేకపోతే, అప్పులు తీర్చే మార్గం కనపడక పోతే కోర్టులో insolvency petition (దివాలా పిటిషన్) వెయ్యండి. అప్పుడు కోర్టు మీకు సమయం ఇవ్వడమెూ లేదా అప్పులమీద వడ్డీలు తగ్గించి అసలు చెల్లించాలా ఉత్తర్వులు ఇవ్వడమెూ చేస్తుంది. కానీ ఒకసారి దివాళా పిటిషన్ వేస్తే భవిష్యత్తులో మీకు ఎక్కడా అప్పులు పుట్టవు అలాగే గౌరవం కూడా పోతుంది. ఏది ఏమైనా మీకు అప్పులు ఇచ్చిన వారు ఏ భరోసాతో ఇచ్చారో ఆ మార్గం ఆలోచించి అప్పులు తీర్చండి. ఎటువంటి పరిస్థితుల్లో జీవితం మీద నమ్మకం కోల్పోవద్దు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. పోరాడి గలవాలి.
ఆత్మహత్య వల్ల సాధించేది ఏమీ లేదు సరికదా సమాజంలో పిరికివాడు అనే పేరు, కుటుంబ సభ్యులకు తీరని దుఃఖం మిగిల్చిన వారు అవుతారు. ఆలోచించండి. పరిష్కారం దొరుకుతుంది. మీ ప్రయత్నం మంచిది అయితే భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు.