Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home information

నాకు రూ. 30 లక్షల అప్పు ఉన్నది. నెలకు రూ.20 వేలు వస్తాయి. నా అప్పు తీర్చడం ఎలా?

Admin by Admin
March 10, 2025
in information, వార్త‌లు
Share on FacebookShare on Twitter

దీనికి సరైన సమాధానం చెప్పడం కాస్త కష్టం. కానీ ప్రయత్నిస్తాను. ముఖ్యంగా మీ ప్రశ్న లో కొన్ని వివరాలు లేవు. 20000 రూపాయలు సంపాదించే మీరు రూ:30 లక్షల రూపాయలు అప్పు ఎలా చేసారు అనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న. మీకు అప్పు ఇచ్చిన వారు అన్ని లక్షలు ఇచ్చారంటే మీరు తప్పక తీర్చగలరు అనే నమ్మకం ఉంటేనే ఇస్తారు. అలాంటప్పుడు వాళ్ళకు మీ మీద ఉన్న నమ్మకం మీపై మీకు లేకపోతే ఎలా? ఆలోచించండి. వాళ్ళు మీ మీద అంత నమ్మకం పెట్టారు అంటే మీకు తీర్చగలిగే వనరులు ఉన్నాయి అని వాళ్ళు నమ్మారు. ఆ వనరులు ఏమిటో ఆలోచించండి. ఇక ఆ అప్పులు పిల్లల ఉన్నత చదువుల కోసం చేసి ఉంటే మీ పిల్లల చదువు పూర్తి అయి ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళని తీర్చమనండి. అది వాళ్ళ బాధ్యత. మన పిల్లలు మన ఆస్ధులకు మాత్రమే కాదు, వారి భవిష్యత్తు కోసం మనం చేసే అప్పులకు కూడా బాధ్యత వహించాలి. ఇలా అంటున్నందుకు ఏమి అనుకోవద్దు.

అదే ఆ అప్పులు మీ వ్యసనాలకు చేసి ఉంటే వాళ్ళకి బాధ్యత లేదు. ఎలా అయినా మీరే తీర్చుకోవాలి. ఇంకొక విషయం. మీరు అప్పులు రూ:30 లక్షలు అన్నారు కానీ అవి secured loans or unsecured loans అన్నది చెప్పలేదు. అలాగే ఆ అప్పులు బ్యాంకు ల నుండి తీసుకున్నారా లేదా మీకు తెలిసిన వారి దగ్గర తీసుకున్నారా అన్నది చెప్పలేదు. మీకు సొంత ఇల్లు గానీ స్థలం కానీ ఉన్నట్లయితే మీరు వాటిని అమ్మి ముందు అప్పులు తీర్చేయండి. అప్పుడు మీకు గౌరవం లభిస్తుంది. తర్వాత మీ ఆదాయం బట్టి ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని కొద్దిగా పొదుపుగా జీవించండి. నెమ్మదిగా అన్నీ సర్దుకున్నాక మళ్ళీ ఇల్లు కొనుక్కోవచ్చు.

how to pay 30 lakhs loan

ఇక ఆఖరుగా ఒక్క మాట, మీకు ఏ విధమైన ఆదాయ మార్గాలు లేకపోతే, అప్పులు తీర్చే మార్గం కనపడక పోతే కోర్టులో insolvency petition (దివాలా పిటిషన్) వెయ్యండి. అప్పుడు కోర్టు మీకు సమయం ఇవ్వడమెూ లేదా అప్పులమీద వడ్డీలు తగ్గించి అసలు చెల్లించాలా ఉత్తర్వులు ఇవ్వడమెూ చేస్తుంది. కానీ ఒకసారి దివాళా పిటిషన్ వేస్తే భవిష్యత్తులో మీకు ఎక్కడా అప్పులు పుట్టవు అలాగే గౌరవం కూడా పోతుంది. ఏది ఏమైనా మీకు అప్పులు ఇచ్చిన వారు ఏ భరోసాతో ఇచ్చారో ఆ మార్గం ఆలోచించి అప్పులు తీర్చండి. ఎటువంటి పరిస్థితుల్లో జీవితం మీద నమ్మకం కోల్పోవద్దు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. పోరాడి గలవాలి.

ఆత్మహత్య వల్ల సాధించేది ఏమీ లేదు సరికదా సమాజంలో పిరికివాడు అనే పేరు, కుటుంబ సభ్యులకు తీరని దుఃఖం మిగిల్చిన వారు అవుతారు. ఆలోచించండి. పరిష్కారం దొరుకుతుంది. మీ ప్రయత్నం మంచిది అయితే భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు.

Tags: loan
Previous Post

మొగలిపువ్వు వాసనకు నాగుపాములు వస్తాయని అంటారు. నిజమేనా? ఎందుకు?

Next Post

మిరియాల పొడి, ఉప్పు, నిమ్మ‌ర‌సం… ఈ మూడింటితో ఏయే అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చో తెలుసుకోండి..!

Related Posts

వినోదం

ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?

June 14, 2025
వినోదం

మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా…?

June 14, 2025
వినోదం

మెగా ఫామిలీ మీద కామెంట్స్ చేసి సినిమా అవకాశాలు కోల్పోయిన వారు వీరేనా ?

June 14, 2025
హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!