అవిసె గింజల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామందికి వీటి గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఔషధాల్లో ఉపయోగించే అవిసె గింజలతో బరువు తగ్గటానికి ఉపయోగిస్తారు. జట్టు సమస్యలకు వాడొచ్చు..మీ చర్మం కాంతివంతగా అయ్యేందుకు కూడా వాడొచ్చు. అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపే గుణాలున్నాయని మనలో చాలా తక్కువమందికి తెలిసి ఉంటుంది..ఈ ఫ్లాక్ సీడ్స్ జెల్ ను ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవచ్చో చూద్దాం. ఇందులో 4 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు, 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, 2 విటమిన్ ఇ క్యాప్సూల్స్, 2 టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్ పక్కన పెట్టుకోండి. ముందుగా 2 కప్పుల నీళ్లు మరిగించి అందులో అవిసె గింజలు వేయండి.. నీరు చిక్కబడే వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి ఫిల్టర్ చేయండి.
మిశ్రమం చల్లారాక అందులో అలోవెరా జెల్, విటమిన్ ఇ క్యాప్సూల్స్, బాదం నూనె వేయాలి. బాగా కలిపితే.. ఇది జెల్ లాగా మారుతుంది. మీకు అవసరం లేకుంటే అలోవేరాను వేయకండి. కొందరికి అలోవెరా పడదు. దీన్ని మీ జుట్టుకు పట్టించి మసాజ్ చేయండి. ఒక గంటసేపు ఉంచి తలస్నానం చేస్తే.. జుట్టు తళతళ మెరుస్తుంది. అవిసె గింజలు మీ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. దీంతోపాటు వేగంగా జుట్టు పెరుగుదలకు సహాయపడే B విటమిన్లను కూడా ఇవి జుట్టుకు అందిస్తాయి.
ఈ గింజల్లో విటమిన్ ఇ కూడా ఉంటుంది, ఇది మీ తలపై ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీంతో జుట్టు వేగంగా పెరుగుతుంది. అవిసె గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు స్కాల్ప్‌లో మంటను తగ్గించి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. జుట్టు పొడిగా ఉండటాన్ని నివారిస్తాయి. చాలామంది ఐబ్రోస్ పలుచగా ఉంటాయి. అలాంటి వారు ఫ్లాక్ సీడ్స్ జెల్ ను అలోవేరా వేయకుండా పైన చెప్పినట్లుగా తయారు చేసుకోండి. అవసరమైతే..ఆయిల్ కూడా స్కిప్ చేయండి, ఏం ఫర్వాలేదు. కేవలం వాటర్, ఫ్లాక్ సీడ్స్ తో జెల్ చేసుకుని వడకొట్టి దానిని డైలీ పడుకునే ముందు కనుబొమ్మలకు, కనురెప్పలకు రాశారంటే మీ కనుబొమ్మలు ఒత్తుగా మారతాయి. కనురెప్పలు పొడవుగా అయి అందంగా ఉంటాయి. వారం రోజులలోనే మీరు ఈ మార్పును గమనిస్తారు. దీనిని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోండి.
అవిసె గింజలపొడితో పొట్టలో కొలెస్ట్రాల్ కూడా తగ్గించుకోవచ్చు. వాటిని దోరగా వేయించుకుని పొడిలా చేసుకుని గోరువెచ్చని నీళ్లలో వేసుకుని తాగుతారు. లేదా ఆ పొడిని రొట్టెల్లో, సలాడ్స్ లో కలుపుకోవచ్చు. ఇలా ఏదో ఒక విధంగా పొడిని శరీరానికి అందించాలి. ఎన్నో అద్భుతమైన గుణాలున్న అవిసె గింజెలను మీరు ఓ సారి ట్రై చేయండి.