కూల్ డ్రింక్స్.. వేసవి వచ్చిందంటే ఈ డ్రింక్స్‌కు డిమాండ్ పెరుగుతుంది. చాలా మంది కూల్ డ్రింక్స్‌ను మంచి నీళ్లలా సేవిస్తుంటారు. చిన్నారులకు ఆ వయస్సు నుంచే ఈ డ్రింక్ లను తాగడం అలవాటు చేస్తున్నారు. దీంతో వారిలో చిన్నతనం నుంచే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కూల్ డ్రింకుల్లో ఉండే సమ్మేళనాలు మన ఆరోగ్యానికి మంచివి కావని, వాటిని తాగితే అనేక దుష్పరిణామాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నప్పటికీ చాలా మంది వినడం లేదు. అయితే ఆరోగ్యం మాట అటు ఉంచితే కూల్ డ్రింక్‌ల వల్ల మనకు పలు ఇతర ఉపయోగాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
పింగాణీ పాత్రలపై ఉన్న అన్నిరకాల మచ్చలు, మరకలను దూరం చేస్తాయి. ప్రతీ ఇంటిలో ఉన్న కంబళ్ళు, రగ్గులకు ఉన్న మురికిని పోగొడుతాయి. అడుగు అంటిన లేక మాడిపోయిన వంట పాత్రలను శుభ్రం చేసుకోవచ్చు. బట్టలపై ఉన్న జిడ్డును సబ్బుకూడా పోగోట్టలేని దానిని ఇవి దూరం చేస్తాయి. జుట్టుకు అంటిన రంగును వెంటనే వదిలించుకోవచ్చు. ఏ రకమైన లోహం పైన పడిన రంగును వెంటనే పోగోడుతాయి. కార్ బ్యాటరీ, ఇన్వర్టర్ బ్యాటరీలకు పట్టిన తుప్పును వదలగొడుతాయి. అన్నిటికంటే కీటక నాశనిగా బాగా పనిచేస్తాయి.
టవల్స్ మీద మరకలను కూల్ డ్రింక్స్ తో వదిలించుకోవచ్చు. టాయ్ లెట్స్ ను బాగా శుభ్రపరుస్తాయి. పాత నాణాలను శుభ్రపరుస్తాయి. అల్యూమినియమ్ ఫాయల్ ను శుభ్రపరుస్తాయి. చ్యూయింగ్ గమ్ మరకలను వదిలిస్తాయి. బట్టల పై వున్న రక్తం మరకలను వెంటనే పోగొడుతాయి. మురికిగా వున్న జుట్టును బాగా శుభ్ర పరుస్తాయి. ఇంటిలో వీటిని నీటిలో కలిపి ఇల్లు తుడిస్తే చాలా బాగుంటుంది. క్రిమి కీటకాలను పారద్రోలుతాయి. కూల్ డ్రింక్స్ వల్ల ఇతర లాభాలే తప్ప ఆరోగ్యానికి ఎలాంటి లాభం కలగదు, నష్టం తప్ప.