మంచి నీళ్లు తాగే చెంబు నుండి స్నానానికి ఉపయోగించే గంగాళం వరకు అన్నీ రాగితో చేసినవే ఉపయోగించే వారు మన పూర్వీకులు. ఇంట్లో ఉన్న ప్రతీ వంట పాత్ర రాగిదే. అంతలా ఉపయోగించే వారు రాగిని..ఎందుకు వారు రాగిపాత్రలనే ఉపయోగించేవారు..? వాటిని ఉపయోగించడం వల్ల వాళ్ళు పొందిన లాభాలేంటి, వాటిని ఉపయోగించకపోవడం వల్ల మనం పొందుతున్న నష్టాలేంటి..? అనేది ఓ సారి బేరీజు వేసుకుందాం..అప్పుడుగానీ తెలియదు మనకు రాగి చేసే మేలేంటో….
సైన్స్ ప్రకారం రాగి పాత్రలు ఫుడ్ పాయిజినింగ్ కి కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయని తెలుస్తోంది. రాత్రంతా రాగి పాత్రలో నీళ్లు ఉంచి ఉదయాన్నే తాగడం వల్ల శరీరానికి కావల్సిన కాపర్ అందుతుంది. రాగి పాత్రలో నిల్వ ఉంచిన రెండు లీటర్ల నీటి ద్వారా 40 శాతం కాపర్ పొందగలుగుతాం. రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉంచిన ఒక గ్లాసు నీటిని తాగడం వల్ల కిడ్నీల్లో ఉండే మలినాలు తొలగిపోతాయి. జీర్ణాశయాంతర నాళాన్ని శుభ్రం చేస్తాయి. అంతేకాదు జీర్ణ ప్రక్రియ ఆరోగ్యంగా ఉండటానికి, ఒబేసిటీని తగ్గించి ఫ్యాట్ ని కరిగించడానికి ఇది సహకరిస్తుంది.
జాయింట్ పెయిన్స్, ఇతర నొప్పులను నివారించడానికి కాపర్ యాంటీ ఇన్ల్ఫమేటరీగా పనిచేస్తుంది. ఎముకల బలానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి కాపర్ సహకరిస్తుంది. ప్రస్తుతం టీనేజర్ల నుంచి అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య తెల్ల జుట్టు. పిగ్మెంటేషన్ నుంచి బయటపడటానికి కాపర్ మంచి సొల్యూషన్. ఇది చర్మం, జుట్టు, కళ్లలో వచ్చే పిగ్మెంటేషన్ సమస్యలకు సహజంగా పనిచేస్తుంది. రాగి పాత్రలలో తినడం అలవాటు చేసుకుంటే.. తెల్ల జుట్టుని నివారించవచ్చు. ఇప్పుడు చెప్పండీ వందేళ్ళైనా ఉక్కులా బతికిన పూర్వకాలం మనుషులకు… 50 యేళ్ళకే కాటికి కాళ్ళు చాపుకునే మనకు తేడా ఏంటని..?