నీతూ… అన్న పెళ్లికి షాపింగ్ చేయడానికి ఓ పెద్ద షాపింగ్ మాల్ కు వెళ్లింది. రెండు మంచి డ్రెస్ లను సెలెక్ట్ చేసుకొని వాటిని తీసుకొని ట్రయల్ రూమ్ కు వెళ్ళి ట్రై చేసింది..ఓకే ఫిక్స్ అనుకొని వాటిని ప్యాక్ చేయించుకొని ఇంటికి వచ్చేసింది. అన్నయ్య పెళ్లి అయిన రెండో రోజే ఆమె వాట్సాప్ కు వాళ్ళ ప్రెండ్ ఓ వీడియో పంపింది…ఈ వీడియోను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది నీతూ… అందులో నీతూ ట్రయల్ రూమ్ లో బట్టలు ట్రయల్ చేస్తున్న విజువల్స్ ఉన్నాయ్.. నీతూ బట్టలు మార్చుకుంటున్న వీడియో ఆ పాటికే సోషల్ మీడియాలో విస్తరించిపోయింది. ఇది కేవలం ఒక్క నీతూ పరిస్థితే కాదు..చాలా మంది మహిళలకు ఎదరవుతున్న పెద్ద సమస్య… ట్రయల్ రూమ్ లలోనే కాదు, ఫంక్షన్ హాల్ టాయిలెట్స్ లో, పబ్లిక్ టాయిలెట్స్ లో… హోటల్ రూమ్ లలో సీసీ కెమెరాలను అమర్చి అమ్మాయిల నగ్న చిత్రాలను దొంగచాటుగా రికార్డ్ చేసిన వీడియోలు కోకొల్లలు.
ఈ విషయంలో అమ్మాయిలు చాలా జాగ్రత్త పడాలి… ఇక్కడ చెప్పిన కొన్ని చిట్కాలు ఫాలో అయ్యి ..రహస్యప్రదేశాల్లో దొంగ చాటుగా అమర్చిన సీసీ కెమెరాలను గుర్తించి.. మన పరువు బజారున పడకుండా జాగ్రత్త పడాలి. డ్రస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్లినప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా, లోపలికి వెళ్ళగానే మీ చుట్టూ ఉన్న అద్దాలను గమనించండి. ఎదురెదుగా రెండు అద్దాలు ఉన్నట్లయితే, మీకు వెనకాల ఉన్న అద్దంపై మీ చేయి పెట్టితాకండి. అది లేత వర్ణం రంగులో కాంతిని వెదజల్లే విధంగా ఉన్నట్లయితే, మీ కళ్ళను ఆ అద్దానికి దగ్గరగా వెళ్లి చూడండి. మీ అనుమానం నిజమని అనిపిస్తే వెంటనే అక్కడ ఉన్న లైట్స్ ని స్విచ్ ఆఫ్ చేసేయండి. అప్పుడు తెలుస్తుంది అటువైపు ఎవరైనా ఉన్నారా? లేదా అన్న విషయం.
రెండు వైపులా ఎదురెదుగా ఉన్న అద్దాలలో మిమ్మల్ని ఎవరైనా గమనిస్తున్నారా? లేక ఆ రూంలో సీసీ కెమెరాలు ఏవైనా ఉన్నాయా? అని తెలియాలి అంటే.. మీ ట్రైల్ రూం ప్రకాశవంతంగా ఉండి, పక్కనే ఉన్న మరో ట్రైల్ రూం డార్క్ గా ఉంటే వెంటనే టార్చ్ లైట్ వేసి ఎదురుగా ఉన్న మిర్రర్ పై టార్చ్ లైట్ వేస్తూ, ఆ మిర్రర్ గుండా చూడండి. ఆ ఫ్లాష్ లైట్ ద్వారా తెలుస్తుంది, అటువైపు ఎవరైనా ఉన్నది , సీసీ కెమెరాలు ఉన్నాయా? లేదా అన్నది. మీరు ట్రైల్ రూంలోకి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ప్రైవేట్ హోటల్/రూంలో దిగినప్పుడు మొదట చేయాల్సిన పని ఏంటంటే అక్కడ చిన్న చిన్న రంధ్రాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా మనకు కనిపిస్తున్న ఫ్లవర్స్ బొకేస్, గోడ గడియారాలు, టెడ్డీ బేర్స్,ఎయిర్ ఫ్యూరిఫైర్స్, బుక్ షెల్ప్స్.. ఇలాంటి చోట సీసీ కెమెరాలు ఉన్నాయోమో చెక్ చేసుకోవాలి.
మాములుగా అద్దాలను గోడకు ఫిట్ చేసినవి లేదా కొన్ని తయారుచేయించి ఫిట్ చేసి ఉంటారు. గోడకు ఫిట్ చేసినవి అయితే మ్యాగ్జిమం అక్కడే ఉంటాయి. అయితే అవి టూ వే మిర్రర్స్ లేదో చూసుకోవాలి. వేళ్ళాడదీసిన అద్దాలైతే ఒకచోటు నుండి మరొక చోటుకు మారుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రెండిటివల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మిర్రర్ ను చెక్ చేయడమంటే ఎలా ఉంటే.. మాములు అద్దాలైతే వాటిపై చేయి పెట్టి సమతలంగా టచ్ చేయగానే స్మూత్ గా ఉంటుంది మరియు ఎలాంటి సౌండ్ అనిపించదు, అదే టూ వే మిర్రర్ అనుకోండి ప్రతిధ్వని ఉత్పత్తి (వైబ్రేషన్) అవుతుంది. మామూలు అద్దంతో పోల్చితే టూ వే మిర్రర్ ముట్టుకోగానే మీకు ఆటోమేటిక్ గా దాని ప్రభావం తెలిసిపోతుంది.