బాహుబలి తొలి భాగం రిలీజ్ అయిన దగ్గర నుంచి సినీ జనాలను వేదిస్తున్న ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.? అయితే ఈ ప్రశ్నకు బాహుబలి 2 సమాధానం ఇచ్చిన దర్శకుడు రాజమౌళి, చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే బాహుబలి 2వ భాగాన్ని ముగించేశాడు. ఇప్పుడు ఆ సమాధానం దొరకని ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. బాహుబలి తొలి భాగంలో శివుడు, భల్లాలదేవుడి కొడుకు భధ్రని తల నరికి చంపాడు. అయితే రెండో భాగంలో భల్లాలదేవుడి భార్యకు సంబంధించిన సన్నివేశాలుంటాయని భావించిన ప్రేక్షకులకు ఆమె ఎవరన్నది సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది.
తొలిభాగంలో కాలకేయల నేపథ్యం వాళ్ల నాయకుడికి వివరాలను సవివరంగా చూపించిన చిత్రయూనిట్ రెండో భాగంలో కుంతల రాజ్యం మీద దాడిచేసిన పిండారీల నేపథ్యం నాయకుడిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. తొలిభాగంలో ఏ సాయం కావాలన్న ఈ మిత్రుడన్నాడంటూ కట్టప్పకు మాట ఇచ్చిన అస్లాం ఖాన్ రెండో భాగంలో కనిపిస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. దేవసేనను విడిపించడానికి ప్రాణత్యాగానికి సైతం సిద్ధమైన అవంతిక నేపథ్యం కుటుంబం లాంటి వివరాలను కూడా ఎక్కడా ప్రస్థావించలేదు. కట్టప్ప బాహుబలిని చంపే సన్నివేశంలో కాలకేయులు బాహుబలిపై దాడి చేస్తారు. అసలు వాళ్ళు ఎలా వచ్చారు. దాని వివరాలు సరిగా చెప్పలేదు!
అయితే వీటన్నిటిని సరిగా చూపిద్దామనే రాజమౌళి అనుకున్నారంట. కానీ అప్పటికే సినిమా లెంత్ ఎక్కువ అవ్వడంతో సెన్సార్ దృష్ట్యా కట్ చేయాల్సి వచ్చింది అంట!