సంపద, మంచి కెరీర్, స్థిరంగా వచ్చి పడే డబ్బు, చక్కని ఆరోగ్యం, కలహాలు లేని జీవితం… వెరసి హ్యాపీగా జీవించాలనే ఎవరైనా కోరుకుంటారు. కష్టాలతో, సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో ఉండాలని ఎవరూ కోరుకోరు. కానీ కొందరికి అదేమిటో అదే పనిగా కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఏ వ్యక్తికైనా జీవితంలో సక్సెస్ వస్తుందో రాదో, ధనం సంపాదిస్తారో లేదో తెలుసుకునేందుకు ఓ మార్గం ఉంది. అదేమిటంటే.. చేతిలోని రేఖలను చూడడం. కింద చెప్పిన విధంగా మీ అరచేతుల్లో గనక రేఖలు ఉంటే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఎవరికైనా అరచేతిలో త్రిభుజాకారంలో సింబల్ ఉంటే వారికి ధనం బాగా కలసి వస్తుందట. వీరు చాలా అదృష్టవంతులట. ఏం చేసినా కలసి వస్తుందట. జీవితంలో వీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారట.
అరచేతిలో ఆంగ్ల M అక్షరం వచ్చేలా ఆకారం ఉంటే వీరికి వివాహం చేసుకున్న తరువాత ధనం కలసి వస్తుందట. అప్పటి వరకు సంపాదన అంతంత మాత్రంగానే ఉంటుందట. వివాహం అయ్యాకే వీరి జీవితం మారుతుందట. చేతిలో చైన్ మాదిరిగా రేఖలు ఉంటే వీరు చిన్న తనం నుంచే అన్ని సమస్యలు ఎదుర్కొంటారట. ఆరోగ్యం బాగుండదట. పెద్దయ్యాక ఆర్థిక సమస్యలు ఇంకా ఎక్కువవుతాయట. అరచేతిలో పైన కింద రెండు స్టార్లు ఉంటే వీరికి ఏదో ఒక రంగంలో తగిన గుర్తింపు లభిస్తుందట. ఆ రంగంలోనే వీరు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకుంటారట. అరచేతిలో రెండు చతురస్రపు ఆకారాలు ఉంటే వీరికి అన్ని అంశాల్లోనూ సెక్యూర్ లైఫ్ ఉంటుందట. చాలా హ్యపీ లైఫ్ జీవిస్తారట. ఏ అంశం పట్ల దాదాపుగా సమస్యలు ఎదురు కావట.
త్రిభుజాకారం వచ్చేలా గుర్తు ఉంటే వీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అవుతారట. అంతులేని పేరు, ప్రఖ్యాతులను పొందుతారట. ఆంగ్ల X ఆకారంలో రెండు గుర్తులు అరచేతిలో ఉంటే వీరికి లైఫ్ లో అన్నీ సమస్యలే వస్తాయట. ముఖ్యంగా ఆరోగ్య పరంగా ఇబ్బందులు కలుగుతాయట. వచ్చిన డబ్బు అంతా ఆరోగ్యం కోసమే ఖర్చు పెడతారట. సమాంతరపు గీతలు అరచేతిలో ఉంటే వీరు హ్యాపీ లైఫ్ గడుపుతారట. అన్ని అంశాల్లోనూ సమస్యలు దాదాపుగా రావట. అంత పాపులర్ అవకపోయినా ధనం, ఆరోగ్యం, వైవాహిక సమస్యలు ఉండవట.