Hair Loss : జుట్టు రాలే సమస్య ప్రస్తుతం చాలా మందికి వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, ఆందోళన, కాలుష్యం, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల చాలా మందికి జుట్టు రాలిపోతుంటుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. కనుక ఆ ఆహారాలను తీసుకోవడం మానేయాల్సి ఉంటుంది. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
1. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి ఉత్పత్తులు అందరికీ పడవు. అవి కొందరిలో టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుతాయి. దీంతో జుట్టు రాలిపోతుంది. అలాగే చుండ్రు, గజ్జి, తామర, బొల్లి వంటి సమస్యలు వస్తాయి. కనుక అలాంటి వారు పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం మానేయాలి. దీంతో జుట్టు రాలే సమస్య నుంచి బయట పడవచ్చు.
2. రోజూ తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో రక్త సరఫరా సరిగ్గా ఉండదు. దీంతో రక్తం ద్వారా పోషకాలు జుట్టుకు అందవు. ఫలితంగా జుట్టు రాలిపోవడం, ఇతర జుట్టు సమస్యలు వస్తాయి.
3. బ్రెడ్, పిజ్జా, కేకులు వంటి రీఫైన్ చేయబడిన పిండి పదార్థాలు ఉండే ఆహారాలను కూడా మానేయాల్సి ఉంటుంది. ఇవి కూడా జుట్టు రాలిపోయేందుకు కారణమవుతుంటాయి. కనుక వీటిని తీసుకోరాదు.,
4. కూల్ డ్రింక్స్ అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. కానీ వీటిని తాగడం వల్ల ఎన్నో దుష్పరిణామాలు కలుగుతాయి. వాటిల్లో జుట్టు రాలడం ఒకటి. కూల్ డ్రింక్స్‌ను అధికంగా తాగితే జుట్టు రాలిపోతుంది. కనుక వాటిని కూడా మానేయాల్సి ఉంటుంది.
5. మద్యం అధికంగా సేవించినా జుట్టు బాగా రాలిపోతుంది. కనుక మద్యం సేవించడం కూడా మానేయాలి. దీని వల్ల జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.